Movies

శ్రీను వైట్ల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి…. పరిస్థితి తారుమారు కావటానికి కారణం ఎవరో తెలుసా?

తెలుగు సినిమాల్లో స్టార్ డైరెక్టర్ గా స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి హిట్ కొట్టిన శ్రీను వైట్ల కమర్షియల్ మూవీకి కామెడీ జోడించి తనదైన శైలితో ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. మొదటి సినిమా నీ కోసం మూవీ. అయితే 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం దగ్గర ఉన్న కందులపాలెం అనే పల్లెటూరు లో 1972సెప్టెంబర్ 24న జన్మించాడు. నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, నాన్న వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు..వాళ్ళు, అత్తయ్యలూ, అందరూ కలిసి చాలా పెద్ద ఫ్యామిలీ. అందుకే అందరి మధ్యలో ఇతడి బాల్యం సరదాగా గడిచిపోయింది. అయితే చిన్నప్పటినుంచీ సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళిపోయి ఏదో చెయ్యాలనే అలోచన ఉండేది.

ఏమి చెయ్యాలో తెలీదు, అది ఎలా సాధ్యపడుతుందో కూడా ఆలోచించలేని వయసు. పైగా వీరిది చిన్న పల్లెటూరు, సినిమా రంగమంతా మద్రాసులో ఉంటుంది. అయినా ఇతడి అలోచనలన్నీ సినిమాల చుట్టూనే తిరుగుతుండేవి.ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి, 1984లో, కాకినాడ వెళ్ళి చదువుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. పక్కనే రామచంద్రాపురంలో కాలేజీ ఉన్నా, కాకినాడ వెళ్ళితే ఇతడిని ఎవరూ చూడరూ, విడిగా రూమ్ లో వుంటూ ఇష్టమొచ్చినన్ని సినిమాలు చూడొచ్చు కదా.

ఆ విధంగా 1984-86 మధ్యలో కాకినాడలో ఇంటర్మీడియట్ చదువుతూ ఎడాపెడా సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసేవాడు. ఫ్రెండ్స్ అందరూ హీరోల్ని అభిమానిస్తుంటే ఇతడు మాత్రం మణిరత్నంని అభిమానిస్తుండేవాడు. డైరెక్టర్ కావాలన్న ఆలోచన అప్పట్లోనే ఉండేదోమో. చదువు విషయానికొస్తే, మరీ తప్పితే తిడతారు కాబట్టి పాస్ అవ్వటానికి కావల్సినంత చదివి ఎలాగైతేనేం ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. కథలు వ్రాయడం, నాటకాలు వేయడం, ఇలాంటివేమీ లేవు. ఉన్న టైమంతా సినిమాలు చూడ్డమే!

తరువాత బి.ఎస్సీ చదవాడినికి మళ్ళీ కాకినాడకే వచ్చాడు. ఐతే ఇంక అప్పటికే సినిమా జ్ఞానమంతా ఒంటబట్టేసింది కాబట్టి మద్రాసు వెళ్ళిపోవాలని నిర్ణయానికివచ్చేశాడు – బి.ఎస్సీలో చేరిన నాలుగైదు నెలలకే ఫీజులు కట్టడానికని ఇంట్లో ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుని బొకారో ఎక్స్‌ప్రెస్ ఎక్కేశాడు. మద్రాసు ఎలా ఉంటుందో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు.ప్రయాణం మొదలైంది. ట్రైన్లో ఒక కుర్రాడు పరిచయమయ్యాడు. అతనిది మద్రాసు దగ్గరలోనే ఏదో ఒక వూరు. అతని స్నేహితుడు జాస్తి చౌదరి అనే అతను మద్రాసులో ఉంటాడని చెప్పి ఎడ్రసు ఇచ్చి,ఎప్పుడేనా వీలైతే కలుసుకోమని చెప్పాడు. ఇతడి బుర్ర వేగంగా పనిచేసింది, మద్రాసులో దిగగానే ఏం చెయ్యాలో అప్పుడే నిర్ణయించుకున్నాడు.

మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగేసరికి అక్కడ సిటీ బస్సులన్నీ సమ్మె బాట పట్టాయి. చేతిలో జాస్తి చౌదరి అనే అపరిచిత స్నేహితుడి చిరునామా ఉంది. పాండీ బజార్. ఎంతదూరం ఉంటుందో తెలీదు. నడవడం మొదలెట్టాడు. అలా దాదాపు 15 కి.మీ. దూరం నడిచి వెళ్ళి జాస్తి చౌదరి రూమ్ తలుపు తట్టాడు. రైల్లో కలిసిన కుర్రాడు నాకు బాగా ఫ్రెండ్ అనీ, అతనే ఇక్కడికి వెళ్ళమన్నాడనీ నమ్మకం కుదిరేలా చెప్పాడు. అతను సరేనని నేను తనతో మూడు రోజులు ఉండడానికి ఒప్పుకున్నాడు. దాంతో అక్కడ తాత్కాలికంగా సెటిలయ్యాడు.

ఆ మూడు రోజుల్లోనే బయటికి భోజనానికి వెళ్ళినప్పుడు కృష్ణవంశీ పరిచయమయ్యాడు. నాకు వసతి కావాలని అడిగితే తన గదిలో ఉండమని అన్నాడట.అలా కృష్ణవంశీ రూమ్మేట్గా సెటిలయ్యాడు. చేతిలో డబ్బులున్నాయి కాబట్టి తిండికేమీ ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. అలా మద్రాసు వచ్చిన పదిహేను రోజులకి ఇంటికి ఉత్తరం రాశాడు. ఇలా మద్రాసులో ఉన్నాను, నాకోసమేమీ బెంగపడకండి, నేను క్షేమంగానే ఉంటున్నాను. నేనే మళ్ళీ ఉత్తరం రాస్తాను అని. అప్పటికే ఇంట్లో వాళ్ళు ఇతడి కోసం తీవ్రంగా వెదుకుతున్నారంట. నా అడ్రసు తెలిస్తే వచ్చి ఇతడిని లాక్కెళ్ళి పోవడం ఖాయం.అందుకే అడ్రసు లేకుండా అప్పుడప్పుడూ ఉత్తరాలు వ్రాస్తుండే వాడు. ( ఓ ఆరునెలల తరువాత ఇంటికి వెళ్ళి అందరినీ ఒప్పించి మద్రాసు చేరుకోవడం..అదంతా మరో కథా).

అలా కృష్ణవంశీ రూమ్లో చేరిన రెండునెలలకే తను హైదరాబాదు వెళ్ళిపోయాడు. ఇంక రూమ్లో ఒక్కడే మిగిలిపోయాడు. ఎలాగైనా సినిమా రంగంలో చిన్న అవకాశం రావాలి అని తిరుగుతుండేవాడు. అలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ఒక డిస్టిబ్యూటర్ ద్వారా గోగినేని సుబ్బారావు అనే ప్రొడ్యూసర్ పరిచమయ్యాడు . చిన్ని కృష్ణుడు, పడమటి సంధ్యారాగం అనే సినిమాల నిర్మాణంలో ఆయనకి భాగస్వామ్యం ఉంది. ఇతడి ఆసక్తి తెలుసుకుని చలసాని రామారావు అనే డైరెక్టర్కి ఇతడిని పరిచయం చేశారు. అప్పుడాయన బాలకృష్ణతో ప్రాణానికి ప్రాణం అనే సినిమా తీస్తున్నారు. ఆ విధంగా చలసాని రామారావు వద్ద ఆ సినిమాకి అప్రెంటీస్ గా చేరాడు.

1989 మార్చిలో సినిమా రంగంలో ఇతడిని ‘ప్రాణానికి ప్రాణం’ సినిమా అడుగుపెట్టేలా చేసింది. అయితే ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇదేంట్రా బాబూ పనిచేసిన మొదటి సినిమానే ఇలా బాల్చీ తనేసిందని అనుకుంటుండగా శివ విడుదలై రాంగోపాల్ వర్మ పేరు ఆంధ్ర దేశమంతా మార్మోగిపోతోంది. వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేరదామని ఇతడూ హైదరాబాదు చేరుకున్నాడు. ఐతే అప్పటికే ఆయనదగ్గర అసిస్టెంటుగా చేరడానికి వచ్చిన వాళ్ళ క్యూ చాంతాడంత ఉంది. అక్కడ వీలు కాకపోవడంతో ఏంచెయ్యాలా అని వెదుకుంతుండగా ప్రాణానికి ప్రాణం రోజుల్లో పరిచయమైన డైరెక్టర్ సాగర్ ఎదురయ్యారు. ఆయన్ని ఒప్పించి అసిస్టెంట్ గా చేరాడు.

ఆ సినిమా పేరు ‘నక్షత్రపోరాటం’, ‘అమ్మదొంగా’ మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి, సొంతంగా డైరెక్షన్ చెయ్యగలననేనమ్మకం కలిగి, అసిస్టెంట్ గా మానేసి, కథలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా ఓ సినిమా మొదటి షెడ్యూలు అవగానే హీరోకీ నిర్మాతకీ వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆతర్వాత మిత్రుడు బొందేటి బాల్రెడ్డికి చెప్పడంతో వాళ్ళే ఇతడి దగ్గరికి సినిమా తీద్దామని రావడం, నీకోసం మూవీ రవితేజ, మహేశ్వరి కాంబినేషన్ సినిమా మొదలైతే అయింది కానీ మధ్యలో బడ్జెట్ అయిపోవటం .. మళ్ళా ఇతడే ఎలానో మరికొంత పెట్టుబడి పెట్టడం.అలా అష్ట కష్టాలూ పడి సినిమాని పూర్తిచేశాడు. 38 లక్షల్లో 28 వర్కింగ్ డేస్లో తీసిన సినిమా పూర్తి కావడానికి మొత్తం సంవత్సరంన్నర పట్టింది.

ఆ సినిమా ప్రివ్యూ చూసిన నాగార్డున గారు ఇతడికి దర్శకుడిగా అవకాశం ఇస్తానన్నారు. అలానే ఆ సినిమా చూసిన రామోజీ రావు మొత్తం ఆంధ్రాకి దాన్ని కొనుగోలుచేసి విడుదల చేశారు. 1999 డిసెంబరు 3న రిలీజైంది. సినిమా హిట్ కొట్టి కోటిరూపాయలు వసూలు చేసి, మంచి పేరు తీసుకొచ్చింది. అదే సంవత్సరం 7 నంది అవార్డుల్ని కూడా గెలుచుకుంది.ఆ సినిమా విజయంతో ఇతడి మీద నమ్మకంతో రామోజీ రావు ఇతడికి ఆనందం సినిమాకి అవకాశం ఇవ్వడంతో అది బ్లాక్ బస్టర్ అయింది.

ఆనందమానందమాయే,వెంకీ మూవీస్ ఆకట్టుకున్నాయి. ఇక డీ,దుబాయ్ శీను మూవీ కలెక్షన్ల వర్షం కురిపించాయి. రెడీ,కింగ్ మూవీస్ కూడా మంచి హిట్ కొట్టాయి. నమో వెంకటేశాయ మూవీ బోల్తాకొట్టడంతో 2011లో దూకుడు మూవీ బ్లాక్ బస్టర్ అయింది. నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. బాద్షా మూవీ కూడా హిట్ అయింది. అయితే అక్కడ నుంచి సీన్ రివర్స్ అయింది. ఆగడు,బ్రుస్ లీ ,మిస్టర్ సినిమాలతో డిజాస్టర్ అయ్యాడు. ఇక అమర్ అక్బర్ ఆంటోని మూవీ తీసినా బోల్తా కొట్టింది. మళ్ళీ హిట్ తో రావాలని ఎదురుచూస్తున్నాడు.