Movies

కథలో రాజకుమారి సీరియల్ లో నటించిన సుభద్ర బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

సీరియల్స్ లో నటించే నటీనటలకు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి వాళ్లలో ‘ కథలో రాజకుమారి’ సీరియల్ లో సుభద్ర గా నటించే నటి ఒకరు. ఆమె అసలు పేరు సుధీర రావిపల్లి. సుధీర ఫామిలీ వైజాగ్ లో ఉంటుంది. ఈమెకు సౌర్య రావిపల్లి అనే సిస్టర్ ఉంది. ఈమె కూడా సీరియల్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

సుధీర బిటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంది. అత్తారింటికి దారేది సీరియల్ లో నటిస్తున్న అరవింద్ కేరక్టర్ తెలుసు కదా. ఆ పాత్రకి దినేష్ మాత్రమే సూటవుతాడని అందరూ అనేమాట. అలాంటి దినేష్ ని సుధీర ప్రేమించి, నవంబర్ 10న పెళ్లిచేసుకుంది. దినేష్ ఎవరో కాదు సీరియల్ నటి సుష్మకు సొంత తమ్ముడే. ఇక ఖాళీగా ఉన్న సమయంలో సుధీర వదిన సుష్మాతో కల్సి వీడియోలు చేస్తుంది.

సుధీర,మధు ,సుష్మ,ఆషిక,అంజు సీరియల్స్ లో ఎంత బాగా కనిపిస్తారో బయట కూడా వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. గీతాంజలి అనే సీరియల్ లో తొలిసారి కనిపించిన సుధీర ఇక మూడవ సీరియల్ అయిన కథలో రాజకుమారి తో బాగా పాపులర్ అయింది. ఈ సీరియల్ లో ఆమె నటన అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.