SugarCane Juice:చెరకు రసం త్రాగుతున్నారా….. అయితే ఆ విషయంలో జాగ్రత్త…???
Sugarcane Benefits:వేసవికాలం మొదలైంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వేసవిలో దాహాన్ని తీర్చుకోవటానికి కొబ్బరిబోండం, ఫ్రూట్ జ్యూస్ లు, మజ్జిగ, లస్సి, కూల్ డ్రింక్స్, నీళ్లు… ఇలా రకరకాల పానీయాలను త్రాగుతూ ఉంటాం . అయితే వేసవి పానీయాలలో చెరకు రసం కూడా బాగా ప్రాచుర్యం పొందింది. చెరకు రసాన్ని అన్ని ఫ్రూట్ జ్యూస్ ల మాదిరిగా ఇంటిలో తయారుచేసుకోవడం కుదరదు.
చెరకు రసాన్ని మాత్రం బయట త్రాగవలసిందే. ఈ చెరకు రసం అద్భుతమైన రుచితో పాటు ఎన్నో పోషకాలను కలిగి ఉంది. చెరకు రసాన్ని చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఇష్టంగా త్రాగుతారు. ఒక గ్లాస్ చెరకు రసం వేసవి దప్పికను తీర్చటమే కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. చెరకు రసంలో నిమ్మరసం,అల్లం రసం కలిపి త్రాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో శరీరం నుండి అధిక మొత్తంలో నీరు చెమట రూపంలో బయటకు పోయి నిస్సత్తువగా అనిపిస్తుంది.
ఆ సమయంలో ఒక గ్లాస్ చెరకు రసం త్రాగితే తక్షణ శక్తి వచ్చి నిస్సత్తువ తగ్గుతుంది. చెరకు రసంలో క్యాల్షియం,మెగ్నీషియం,పొటాషియం,ఐరన్, మరియు మెగ్నీషియంలు సమృద్ధిగా ఉండుట వలన చెమట రూపంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి రీస్టోర్ అవుతాయి. కొన్ని పరిశోధనలలో చెరకు రసం త్రాగితే లివర్ ఆరోగ్యంగా ఉంటుందని తేలింది. చెరకు రసంలో ఉండే పొటాషియం పొట్టలో ఇన్ ఫెక్షన్స్ తగ్గించి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది.వేసవిలో డీహైడ్రేషన్ కారణంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి.
చెరకు రసం త్రాగటం ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. చెరకు రసంలో ఉండే ఆల్కలైన్ కంటెంట్ యాంటీ బయోటిక్ ఏజెంట్ గా పనిచేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే నొప్పి, బర్నింగ్ సెన్షేషన్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. చెరకు రసం బరువు తగ్గించటంలో కూడా సహాయపడుతుంది. సరైన సమయంలో సరైన మోతాదులో చెరకు రసాన్ని తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. 100 గ్రాముల చెరకు రసంలో కేవలం 270 కేలరీల శక్తి మాత్రమే ఉంటుంది. చెరకు రసంలో కొవ్వు ఉండదు.
సహజసిద్ధమైన తీపి మాత్రమే ఉంటుంది. చెరకు రసంలో అధికంగా 13 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. అందువల్ల చెరకు రసం త్రాగినప్పుడు కడుపు నిండిన భావన కలిగి ఆహారం తీసుకోవాలనే కోరిక ఉండదు. దాంతో బరువు తగ్గుతారు. రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాక, కణాలు నాశనం కాకుండా చూస్తాయి. దీంతో పాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
చెరుకు రసాన్ని తరచూ తీసుకుంటే మలబద్దకం తొలగిపోతుంది. సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.వేసవిలో చర్మం డ్రై గా మారుతుంది. చెరకు రసం త్రాగటం వలన అందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సి ఆసిడ్స్ చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.