రోజా వర్సెస్ నాగబాబు.. జబర్ధస్త్ టీమ్‌లో ఎవరు ఎటువైపు..
ఎన్నికల్లో ఓటు వేయడం సీక్రెట్ గా ఉంటుంది కానీ, ప్రచారం సీక్రెట్ గా ఉండదు, పబ్లిక్ అయిపోతుంది. అలాంటప్పుడు తమకు ఎవరు ఇష్టమో తేల్చుకోవడం కష్టమే మరి. అయినా తమ ఇష్టానికి అనుగుణంగా జబర్ధస్త్ కామెడీ షో కంటెస్టెంట్స్ నడుచుకుంటున్నారు. దాంతో ఈ షో ఇపుడు రాజకీయాలకు వేదిక అయింది. ఈ షోలో జడ్జీలుగా వ్యవహరిస్తోన్న నాగబాబు జనసేన పక్షాన , రోజా వైయస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా నగరి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. మరోవైపు నాగబాబు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ పోటీ చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఇదే లోక్‌సభ పరిధిలోని భీమవరం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉండడం ద్వారా అన్నయ్య విజయానికి తన వంతు సహకారం అందిస్తున్నారు. నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, టీడీపీ నుంచి శివరామరాజు, నాగబాబుకు గట్టి పోటీ ఇస్తున్నారు. నాగబాబు తరుపున జబర్థస్త్ టీమ్‌లోని ఒక్క హైపర్ ఆది ముందుగా ప్రచారం స్టార్ట్ చేసాడు. తాజాగా చమ్మక్ చంద్ర, రాకింగ్ రాకేష్, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, రాఘవ.. ఇలా ఒక్కరేంటి అంతా జనసేన కోసం ఇంటింటికీ తిరిగి పాంప్లెంట్స్ కూడా పంచేస్తున్నారు.
అంతేకాదు ఇప్పటికే రంగంలోకి దిగి నాగబాబు, జనసేన తరుపున ప్రచారాన్ని ఉదృతం చేస్తున్నాడు. నాగబాబును గెలిపించుకుంటామంటూ ఒక వీడియో మెసెజ్ కూడా పంపించి పనవ్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.అయితే మిగతా జబర్ధస్త్ పార్టిసిపేంట్స్ మాత్రం నాగబాబు తరుపున ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదని టాక్. అలాగే రోజా తరుపున ప్రచారం చేయడానికి కూడా ఎవరు సుముఖంగా లేరని వినిపిస్తోంది.
నాగబాబు, రోజా అంటే అభిమానం ఉన్నా ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉన్న కారణంగా వారంతా ఎవరికి సపోర్ట్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉంటూనే కెరీర్ బాగుంటుందని జబర్థస్త్ లోని మెజారిటీ నటులు డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఎన్నికల్లో కొన్నాళ్ళు సైలెంట్ గా ఉంటె ఆతరువాత ఎలాంటి గొడవ ఉండదని వారి అభిప్రాయం.