హిట్ తర్వాత హీరోలను వెంటాడుతున్న ప్లాప్ భయం….సేంట్ మెంట్ గా మారిందా?
సాధారణంగా సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే సదరు హీరో ఆనందానికి అవధి ఉండదు. అదిరిపోయే హిట్ కొట్టినా, భయం మన హీరోలను వెంటాడుతోందట. బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా హిట్ అవుతుందో,ప్లాప్ అవుతుందోనన్న అనుమానం భయంగా మారిపోతోంది. దీనికి కారణం సెంటిమెంట్. అవును సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువే కదా. మన హీరోలకు ఏదైనా హిట్ వస్తే, దానివెంటనే ప్లాప్ కూడా వచ్చేస్తోంది. ఇది హీరోలను వణికిస్తోంది. హిట్ తర్వాత ఫాన్స్ భారీగా ఊహించుకుంటూ ఆ రేంజ్ లో సినిమా లేకపోతె కుదేలవ్వడమే దీనికి కారణం.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ సాహు. నిజానికి బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ ని దాటి, వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చింది. మరి సాహు ప్లాప్ కాకుండా ఓ రేంజ్ లో ఉన్నా చాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఎందుకంటే హిట్ తర్వాత ప్లాప్ లు అతన్ని వెంటాడుతున్నాయి.
ఈశ్వర్ తో ఎంట్రీ ఇచ్చి, మూడవ చిత్రం వర్షంతో సూపర్ హిట్ కొట్టాడు. ఆతరవాత రెండు ప్లాప్ ల తర్వాత ఛత్రపతి హిట్ ఇచ్చింది. పోనీ ఆతర్వాత హిట్ వచ్చిందా అంటే లేదు. ఐదు ప్లాప్ ల తర్వాత డార్లింగ్ మూవీతో ఫామ్ లోకి వచ్చాడు. అందుకే ఇప్పుడు సాహు పాజిటివ్ టాక్ రావాలని కోరుకుంటున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా గతంలో బ్లాక్ బస్టర్ అందుకుంటే, వెంటనే వచ్చే సినిమా డిజాస్టర్ అయ్యేది. స్టూడెంట్ నెంబర్ వన్ తో సక్సెస్ అందుకుని ఆదితో బాక్సాఫీస్ దగ్గర షేక్ చేసాడు. అయితే ఆతర్వాత అల్లరి రాముడు,నాగ డిజాస్టర్ అయ్యాయి. సింహాద్రితో ఎవరూ ఊహించని క్రేజ్ దక్కించుకున్నాడు. ఇప్పటికీ సింహాద్రి రేంజ్ హిట్ ఏ సినిమాకి రాలేదని చెప్పాలి. ఇక మరో ఆరు ప్లాప్ ల తర్వాత యమదొంగ హిట్ అందుకుంది. అయితే జనతా గ్యారేజ్ తో హిట్ కొట్టినా ఆది,సింహాద్రి రేంజ్ కి రాలేదు. అలాగే అరవింద సమేత సక్సెస్ కొట్టినా, బయ్యర్లకు పెద్దగా లాభాలు రాలేదు.
మగధీరతో సూపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసి, ఆతరవాత ఆరెంజ్ తో దారుణమైన ప్లాప్ చవిచూశాడు. ఎవడు,రచ్చ,నాయక్ మూవీస్ తో హిట్స్ అందుకున్న చెర్రీ రంగస్థలం వరకూ నిజానికి పెద్ద హిట్ రాలేదు. రంగస్థలంతో రికార్డులు తిరగరాసిన చెర్రీ ,వెంటనే వినయ విధేయ రామతో డిజాస్టర్ లోకి వెళ్ళాడు. అందుకే చెర్రీకి కూడా హిట్ తర్వాత భయం పట్టుకుంటోంది.
కాగా రాజకుమారుడుతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కూడా హిట్ తర్వాత డిజాస్టర్స్ చూసాడు. ఆరు సినిమాల తర్వాత ఒక్కడు మూవీతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అయితే నిజం,నాని వంటి నాలుగు ప్లాప్ లు వెంటాడాయి. తర్వాత పోకిరితో ఫామ్ లోకి వచ్చి, 40కోట్లు కలెక్ట్ చేసిన తొలితెలుగు మూవీ గా నిల్చింది. మళ్ళీ దూకుడు వరకూ సక్సెస్ రాలేదు. నేనొక్కడినే వంటి ప్లాప్ ల తర్వాత శ్రీమంతుడుతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బ్రహ్మోత్సవం,స్పైడర్ వంటి మూవీస్ బ్రేక్ లు వేస్తె,భరత్ అను నేను హిట్ అందుకున్నాక ఇక ఇప్పుడు మహర్షి ఎలా ఉంటుందో అనే భయం వెంటాడుతోంది.
అలాగే యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి అనుభవమే చూసాడు. పెళ్ళిచూపులతో హిట్ కొట్టి, ద్వారకలో నిరాశ పొందాడు. అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఆతర్వాత ఏం మంత్రం వేసావే మూవీ అడ్రెస్ లేకుండా పోయింది. గీత గోవిందంతో టాప్ హీరో అయ్యాడు. అయితే నోటా మూవీ డిజాస్టర్ అయింది. గీత గోవిందం 70కోట్లు కలెక్ట్ చేస్తే,నోటా తెలుగు,తమిళ భాషల్లో కేవలం 15కోట్లు తెచ్చింది.