ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న స్టార్ డైరెక్టర్స్
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. టాప్ రేంజ్ కి చేరిన డైరెక్టర్లు వరుసగా డిజాస్టర్స్ చవిచూస్తున్నారు. ఇలాంటి వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటేనేం హీరోలు,నిర్మాతలు భయపడిపోతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని కొత్త డైరెక్టర్స్ తో సర్దేసుకుంటున్నారు. ఒకప్పుడు నెంబర్ వన్ డైరెక్టర్ రేంజ్ కి వెళ్లిన వివి వినాయక్ కి ఇప్పుడు సినిమా రావడం లేదు.
మెగాస్టార్ తో గతంలో ఠాగూర్ తీసి హిట్ కొట్టిన వినాయక్ ఆతర్వాత చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీతో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఫలితంగా చిరుతో తీసిన ఖైదీ నెంబర్ 150బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఇలా గాడిలో పడినప్పటికీ వినాయక్ కి మళ్ళీ ఇంటిలిజెంట్ సినిమా పేరిట చేదు అనుభవం వెంటాడింది. ఈ సినిమా 20కోట్లకు అమ్మేస్తే,కేవలం నాలుగు కోట్లు కూడా రాలేదట. దీంతో స్టార్స్ ఎవరూ కూడా వినాయక్ అంటే భయపడిపోతున్నారట. అయితే బాలయ్య తో సినిమా తీసే ఛాన్స్ వచ్చినా కథ కుదరడం లేదు. ఇక మాస్ మారాజు రవితేజతో గతంలో కృష్ణ మూవీ తీసిన వినాయక్ ప్రస్తుతం రవితేజతో మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడు.
ఇక దూకుడుకి ముందు తర్వాత అన్నచందంగా శ్రీను వైట్ల తీరు తయారయింది. నిజానికి ఆసినిమాతో చాలామంది హీరోలు తమ డేట్స్ ఇచ్చారు. ఇంతలో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన బాద్షా ఏవరేజ్ కావడం,ఇక మహేష్ ఇచ్చిన ఆగడు మూవీ ఛాన్స్ కూడా శ్రీను వైట్లకు డిజాస్టర్ ని మిగిల్చింది. ఎన్ని ప్లాప్ లు వచ్చినా ఇతడి తీరు మారలేదు. అందుకే మిస్టర్,,బ్రూస్ లీ మూవీస్ తో మళ్ళీ రెండు ప్లాప్ లు ఖాతాలో వేసుకున్నాడు. ఇక రవితేజతో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని మూవీ కూడా ప్లాప్ జాబితాలో చేర్చేసింది.
కాగా బ్రహ్మోత్సవం మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల జోలికి ఎవరూ వెళ్లడం లేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఛాన్స్ వచ్చిందన్న టాక్ వచ్చి ఏడాది గడిచినా పురోగతి లేదు. కథలు రెడీగా ఉన్నా సరే,హీరోలు,నిర్మాతలకు ఇతడిపై నమ్మకం దక్కడం లేదు. దీంతో రెండేళ్లుగా వెయిటింగ్ జాబితాలో ఉన్నాడు.