గాసిప్స్ ఉచ్చులో సాయిపల్లవి
తెలుగులో వచ్చిన ఫిదా చిత్రంతో ఆడియన్స్ ని ఫిదా చేసిన అల్లరి బేబీ సాయిపల్లవి తాజాగా వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. సాయిపల్లవి నటించిన తమిళ చిత్రం ‘ఎన్.జి.కె’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు సాయిపల్లవి చేతిలో ఉన్నాయి. మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీగా అందరిచేతా అనిపించుకుంటున్న సాయి పల్లవి ఎంత మంచి పేరు తెచ్చుకుందో చెప్పక్కర్లేదు. అయితే ఆమె ప్రవర్తనతో అంత చెడ్డ పేరు కూడా వచ్చేసింది. తొలి సినిమాతో ఏదో అలా అయిపోయినప్పటికీ ‘కణం’ సినిమా విషయంలో హీరో నాగశౌర్యతో వచ్చిన విబేధాలు ఎన్నెన్నో చెప్పనలవికాదు.
సాయిపల్లవిపై బహిరంగంగా నాగశౌర్య, ఆరోపణలు గుప్పించాడు.పోనీ అదేదో అయిందిలే అనుకుంటే, నేచురల్ స్టార్ నానితో నటించిన ‘ఎం.సీ.ఏ’ టైంలోనూ ఆమెపై బోలెడన్ని గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి సాయిపల్లవి రూమర్స్ లో ఇరుక్కుంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో ‘విరాటపర్వం’ సినిమాలో రానాకి జోడీగా నటించాల్సి ఉంది. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్లో రూపొందుతోంది. అయితే, ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. కానీ, అప్పుడే సాయిపల్లవిపై గాసిప్స్ ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమూ లేకపోలేదని అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటానని సాయిపల్లవి నిర్మాతల్ని హెచ్చిస్తున్నట్టు గాసిప్స్ మొదలయ్యాయి. ఈ రూమర్స్ నిజమా కదా అనే విషయం అటుంచితే, సినిమా సినిమాకి సాయిపల్లవిపై ఇలా రూమర్లు చక్కర్లు కొడుతుంటే, ఆమె కెరీర్‌కి డ్యామేజీ యే కదా. అది చేయను ఇది చేయను అంటూ కండీషన్స్ అప్లై చేస్తూ, లిమిటెడ్‌గా సినిమాలు చేసే సాయి పల్లవిపై అసలు రూమర్లు ఎందుకొస్తున్నట్టు ? ప్రతీ గాసిప్‌కీ రెస్పాండ్ అవ్వాలంటే అన్ని సమయాల్లోనూ కుదరదు కానీ, ఈ తాజా గాసిప్‌కి మళయాళీ బ్యూటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.