ఛార్మితో పూరీ అసలు కథ ఏమిటో తెలుసా?
సినీ పరిశ్రమ రంగుల ప్రపంచమే కాదు ఓ మాయా ప్రపంచం కూడా. అందుకే ఇండస్ట్రీలో కొన్ని కొన్ని బంధాలు విచిత్రంగా ఉంటాయి. ఎవరితో ఎవరు ఎప్పుడు కనెక్ట్ అవుతారో,ఎవరి కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అవుతుందో చెప్పలేం. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి రిలేషన్ కూడా అంతే. ఈ ఇద్దరూ కలిసి జ్యోతిలక్ష్మి సినిమా చేసారు. ఆ సినిమా తర్వాత చిత్రంగా ఇద్దరూ బాగా కనెక్ట్ అయిపోయారు. ఇద్దరూ ఒకే దగ్గరే సెటిల్ అయిపోయారు. పూరీ ఆఫీస్‌లోనే ఆయనతో పాటే, అతడితో సమానంగా అన్ని వ్యవహారాల్లో ఫుల్ ఫ్రీడమ్ ఛార్మికి వచ్చేసింది. అంతేకాదు, ఆ కంపెనీలోనే అసిస్టెంట్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు పూరీతో సమానంగా నిర్మాత పేరు యాడ్ చేసుకునే స్థాయికి ఛార్మి ఇమేజ్ చేరుకుంది.
పూరీ ఎక్కడుంటే అక్కడ ఛార్మి కూడా కనిపించాల్సిందే. మరో ఆప్షన్ కనిపించదని చెప్పాలి. పూరీతో ఛార్మి కనెక్ట్స్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరూ నిజంగానే బాగా కనెక్ట్ అయిపోయారని, ఇప్పుడు పూరీ పూర్తిగా ఛార్మి చేతుల్లో ఉన్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పూరీ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.ఇక ఛార్మి కూడా పూర్తిగా పూరి సినిమాలతో ఇన్వాల్వ్ అయిపోయింది.
ఆయన దర్శకుడు అయితే ఈమె అన్నీ తానై వ్యవహారం చక్కబెడుతోంది. అంతెందుకు ప్రస్తుతం వారణాసిలో 46 డిగ్రీల ఎర్రటి ఎండలో ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ జరుగుతుంటే, అక్కడే పూరీతో పాటు ఛార్మి కూడా ఉంది. ఈ చిత్ర పనులన్నీ ఈ ముద్దుగుమ్మ తానే దగ్గరుండి చూసుకుంటుంది. ఇంత యవ్వారం సాగుతున్నా, తమ రిలేషన్ షిప్ గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నా, ఈ జోడీ మాత్రం అదేం పట్టనట్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. ఏదో ఓ రోజు వీళ్లే క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వస్తే, ఎలా స్పందిస్తారో మరి.