Movies

కోట్ల విలువ చేసే లక్సరీ బంగ్లాలు వదిలేసి చిన్న ఫ్లాట్స్ లో ఉంటున్న టాలీవుడ్ స్టార్స్

ఇల్లు కంటే మనసు విశాలంగా ఉండాలని మన స్టార్స్ బాగా వంటబట్టించుకున్నారేమో గానీ పెద్ద పెద్ద భవంతుల కన్నా చిన్న చిన్న ప్లాట్స్ లోనే హాయిగా ఉండొచ్చని నిరూపిస్తున్నారు. అవును, లంకంత కొంపలు వదిలేసి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ కి షిఫ్ట్ అయిపోయారు. మధ్యతరగతి ప్రజల మనస్తత్వాలు దగ్గరగా ఉండాలని భావిస్తున్నారు. అందుకే సాదాసీదా ఫ్లాట్స్ లో ఉంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి జూబ్లీ హిల్స్ లో పెద్ద రాజభవనం లాంటి ఇల్లుంది. దాదాపు పదివేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్న మహేష్ ఈ రాజభవనం వదిలేసి,జర్నలిస్ట్ కాలనీలో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకుని అక్కడ సెటిల్ అయ్యాడు. సరిగ్గా ఆ ఎదురింట్లోనే మహేష్ సోదరి మంజుల నివాసం ఉంటోంది. అలాగే పవన్ కళ్యాణ్ కొన్నాళ్లపాటు నందగిరి హిల్స్ లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉండేవాడు.

రెండుదేశాయ్ తో విడిపోయాక ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాడు. ఇక జనసేన పార్టీ అధినేతగా అమరావతిలో కూడా ఇల్లు నిర్మించుకున్నాడు. విదేశీ భామతో కల్సి జనసైన్యానికి దిశానిర్దేశం చేస్తున్నాడు. ఇక దర్శకేంద్రుడు రాజమౌళి 30కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా సరే, పెద్ద పెద్ద బంగ్లా కాదంటున్నారు. మణికొండలో విల్లాలో ఉండే జక్కన్న రెంట్ కి ఇచ్చేసి ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కి మారిపోయాడు. దర్శకుడు సుకుమార్ మణికొండలో డ్రీమ్ హౌస్ కట్టాడు. అయితే విపరీతంగా జన రద్దీ పెరిగిపోవడంతో గచ్చీబౌలి ఏరియాకు షిఫ్ట్ అయ్యాడు. ఇక అన్నపూర్ణ స్టూడియో సామ్రాజ్యానికి అధిపతి అయిన అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య కూడా అదే రూట్ లోకి వచ్చేసాడు.

దగ్గుబాటి ఫ్యామిలీకి కూడా కావాల్సిన వాడైన చైతు కావాలనుకుంటే రాజప్రాసాదం లాంటి భవంతుల్లో ఉండవచ్చు. కొత్తది కావాలన్నా కట్టేసి ఇస్తారు కూడా. అయినప్పటికీ సమంతతో కల్సి సాదాసీదా ఫ్లాట్ లో ఉంటున్నాడు. పెళ్ళికి ముందు రెండో సినిమా నుంచి అక్కడే ఉంటున్న చైతు ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాడు. తల్లి దగ్గుబాటి lakshmi ఇంటీరియర్ డెకరేట్ చేయించడం వలన, సెంటిమెంట్ రీత్యా అక్కడే వుంటున్నాడట. ఇక కమెడియన్ అలీ కూడా శ్రీనగర్ కాలనీలో అతిపెద్ద బంగ్లా ఉన్నాసరే,మణికొండలో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యాడు. కాగా జగపతి బాబుకి అపోలో వెనుక వెయ్యి గజాల స్థలం లో భారీ బంగ్లా ఉంది. ఇది కాదనుకుని కూకట్ పల్లిలో నేతా టవర్స్ ఫ్లాట్ లో ఉంటున్నాడు.