Movies

కాజ‌ల్ అగ‌ర్వాల్ ల‌వ్‌స్టోరీ ఫెయిల్యూర్ అయింది ఎందుకో తెలుసా?

“ల‌క్ష్మీక‌ళ్యాణం” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి, “చందమామ‌” తో అంద‌ర్నీ ఆక‌ట్టుకొని, “మ‌గ‌ధీర‌” తో టాప్ హీరోయిన్ గా ఎదిగిన కాజ‌ల్‌ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి 12 ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ ఈ అమ్మ‌డుకు కుర్ర కారులో క్రేజ్ త‌గ్గ‌లేదు. మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన “ఖైదీ నెంబ‌ర్ 150″లో ఈ భామ రెచ్చిపోయి చిరుతో స్టెప్పులు అదరగొట్టేసింది. అయితే ఈ అమ్మడికి ఓ లవ్ స్టోరీ ఉందట. అది సక్సెస్ కాలేదట. మనదేశంలో సినిమాకి ఎంత క్రేజ్ ఉందో క్రికెట్ కి అంతేవుంది. ఈ రెండు రంగాలకు అవినాభావ సంబంధం కూడా ఉంది. ఇక స్టార్ క్రికెట‌ర్ల‌తో టాలీవుడ్ భామ‌ల ప్రేమాయ‌ణం కూడా కొత్తేమీ కాదు. చెన్నై సూప‌ర్ కింగ్స్ తరపున ఐపీఎల్ లో ఆడుతున్న వెస్టిండీస్ ఆట‌గాడు డ్వేన్ బ్రావోతో టాలీవుడ్ అందాల సుంద‌రి శ్రియ ప్రేమ‌లో ఉన్న‌ట్లు అప్పట్లో చాలా వార్త‌లొచ్చాయి.

బ్రావోతో క‌లిసి శ్రియ ఓ పార్టీలో చిందులేస్తూ క‌నిపించ‌డం మ‌రింత బ‌లాన్నిచ్చింది.అయితే ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో గానీ, శ్రియ మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకు ని సెటిల్ అయింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కోసం యువ‌రాజ్ సింగ్‌, మ‌హేంద్ర సింగ్ ధోని మ‌ధ్య ప‌రోక్ష వార్ జ‌రుగుతోందంటూ కూడా గ‌తంలో వార్తలొచ్చాయి. ఇలాంటి వార్తలు కొన్ని నిజమైతే మరికొన్ని పుకార్లుగానే మిగిలిపోతాయి. యువత క్రికెట‌ర్లు, సినిమా స్టార్ల వైపే ఎక్కువ‌గా ఆక‌ర్షితుల‌వుతుంటారు. వారిని ఫాలో అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. అందుకు తగ్గ‌ట్లే మీడియాలో వారికి సంబంధించిన వార్త‌లు కూడా చాలా వ‌స్తుంటాయి.

ఇక ఈ రెండు రంగాలకు చెందిన వ్య‌క్తులు ప‌ర‌స్ప‌రం ల‌వ్ లో ప‌డితే.. అటు మీడియాకు, ఇటు ప్ర‌జ‌ల‌కు పండ‌గే. ఆ జంట‌ల గురించి వార్త‌ల‌తోపాటు పుకార్లు కూడా షికార్లు చేస్తుంటాయి. ఇక “చంద‌మామ” బ్యూటీకి కూడా ఓ ల‌వ్ స్టోరీ ఉంద‌ని కూడా తేలిపోయింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ కూడా ఇలాంటి వార్త‌ల్లో నిలిచే అవ‌కాశాన్ని కొద్దిలో మిస్ చేసుకుందంట‌. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ చెప్పుకొచ్చింది. నిజానికి అంద‌రు హీరోయిన్ల లాగే కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి కూడా చాన్నాళ్ల‌పాటు పుకార్లు షికార్లు చేశాయి. ఆమె ఓ బిజినెస్ మెన్‌తో ల‌వ్‌ లో ఉందంటూ వార్త‌లొచ్చాయి. అయితే, అంద‌రిలా కాజ‌ల్ ఎప్పుడూ ఎవ‌రితోనూ బ‌హిరంగంగా బాయ్ ఫ్రెండ్ తో తిరిగిన దాఖలాలు లేవు. అందుకే రూమ‌ర్ల‌కు ఫుల్ స్టాప్ పడింది.

ఇక త‌మిళంలోనూ ఆమెకు బాగానే ఫాలోయింగ్ ఉంది. అందుకే 34 ఏళ్ల వ‌య‌సొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఇంకా సినిమాల్లో కొన‌సాగుతోంది. చెల్లి నిషా అగ‌ర్వాల్ పెళ్లి చేసుకొని ఓ బిడ్డ‌కు జ‌న్మనిచ్చినా అక్క మాత్రం పెళ్లి జోలి కి వెళ్లడం లేదు. అయితే, తాజాగా కాజ‌ల్ స్వ‌యంగా తానే త‌న ల‌వ్ స్టోరీ గురించి చెబుతూ, త‌న‌ది ఓ ఫెయిల్యూర్ ల‌వ్ స్టోరీ అని తేల్చేసింది. అవును, ఫోర్లు, సిక్సుల‌తో క్రికెట్ ప్రేమికుల‌ను ఉర్రూత‌లూ గించే స్టార్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ‌ నే కాజల్ లవ్ చేసింది. నిజానికి కాజ‌ల్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. దీంతో రోహిత్ ఆట చూసి అత‌డి ప్రేమ‌లో ప‌డిపోయింద‌ట‌. కానీ ఎప్పుడూ రోహిత్ వ‌ద్ద త‌న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్ట‌ లేదట. ఫ‌లితంగా త‌న‌ది వ‌న్ సైడ్ ఫెయిల్యూర్ ల‌వ్ స్టోరీగా మిగిలిపోయిందని చెప్పింది.