బాలయ్య మూవీలో స్టార్ హీరో కూతురు విలన్! ఎవరబ్బా?
ఏపీలో ఎన్నికల కారణంగా అందరూ బిజీ అయినట్టే, బాలయ్య పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఈయన బయట కనిపించడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ప్రస్తుతం బాలయ్య వరస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే అది కూడా కుదర్లేదు. అలాగే బోయపాటి శ్రీను కాంబినేషన్లోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా, ఈ చిత్రం కూడా అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా మొదలయ్యేలా ఉంది. ఎందుకంటే, బోయపాటి సిద్ధం చేసిన కథకు బడ్జెట్ ఎక్కువ కావాల్సి రావడంతో ఇప్పుడు బాలయ్య దాన్ని పక్కన పెట్టాడు.
ఇక పనిలో పనిగా బోయపాటి శ్రీను కూడా బడ్జెట్ కంట్రోల్ చేసే పనిలో బిజీ అయ్యాడు. ఈ గ్యాప్‌లోనే బాలయ్య మరో సినిమాకు ఓకే చెప్పాడని అంటున్నారు. రెండేళ్ల కింద సంక్రాంతికి వచ్చి జై సింహాతో బాగానే సందడి చేసిన బాలయ్య అదే నమ్మకంతో ఇప్పుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సై అంటున్నాడు. ఈ సినిమా జూన్ నుంచి పట్టాలెక్కనుంది. సి కళ్యాణ్ నిర్మాత. కాగా ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా జగపతిబాబు నటించబోతున్నాడు.
ఈ సినిమాలో మరో విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ సెలెక్ట్ అయిందట. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురయిన ఈమె సర్కార్, పందెంకోడి 2 లాంటి సినిమాల్లో లేడీ విలన్‌గా తమిళనాట దుమ్ము రేపింది. ప్రస్తుతం అక్కడ వరసగా విలన్ రోల్స్ చేస్తున్న ఈమె తెలుగులోనూ అదే ఊపు చూపించాలని ఉవ్విళ్లూరుతుంది. పైగా బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాలో విలన్ కారెక్టర్ సామాన్య విషయం కాదు. ఈ సినిమా హిట్టైతే వరలక్ష్మీ జాతకమే మారిపోతుందని కామెంట్స్ వస్తున్నాయి.