KDM బంగారు ఆభరణాల వల్ల ప్రమాదమా? నమ్మలేని నిజాలు
కేడియం ఆభరణాల వల్ల… తయారు చేసేవారికి ధరించేవారికి ఇద్దరికీ అనారోగ్యమే… బంగారం విషయంలో భారతీయుల మోజు, మరియు సంప్రదాయంగా ఆలోచించడం ఏ శుభకార్యం వచ్చినా బంగారం కి మొదటి స్థానం ఇవ్వడం చూస్తూనే ఉన్నాము. అయితే ఆభరణాలను ఎప్పుడు అమ్మినా అంతే రేటు రావాలనే ఆలోచన వినియోగదారుల్లో రావడంతో …KDM ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో కేడియంతో(cadmium) తయారు చేసిన ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయడం…ధరించడం అలవాటైపోయింది.
ఇప్పుడు ఆ kdm తో తయారైన వస్తువుల వాడటం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ధృవీకరించింది. చాలా లేటుగా కేంద్ర ప్రభుత్వం మనదేశంలో కూడా కేడియం ఆభరణాలను అమ్మవద్దని జింక్ తో తయారు చేసిన హాల్ మార్క్ వస్తువులనే అమ్మాలని సూచించడం జరిగింది. అందుకే కేడియం తో కాకుండా ” జింక్ ” తో తయారు చేసిన ఆభరణాలు కొనటం శ్రేయస్కరం. ఇప్పటికే ముంబయి, కోయంబత్తూర్, చెన్నై ప్రాంతాల్లో KDM తో తయారు చేయడం ఆపేస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో దాదాపుగా షాపుల బోర్డుల మీద “91.6 kdm” అని రాసినవి మార్పిడి చేసి “91.6 హాల్ మార్క్” అని ఉండటం లేదా కేడియం అక్షరాలను పీకించేయడం చేస్తున్నారు.
కేడియంతో తయారు చేసే వర్కర్ల పరిస్థితి… ” గతంలో స్వర్ణకారులు ఆభరణాల తయారులో అతుకులకు రాగి, వెండి, బంగారం తో టంకం తయారు చేసుకుని అతుకులకు వాడేవారు. ఈ కేడియంతో తయారు వచ్చాక బంగారం పని చేసే వారు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. కేడియం తో అతుకు పెట్టేటప్పుడు అంటే మండించినప్పుడు రకరకాల విషవాయువు లు వెలువడతాయి. ఆ పచ్చని రంగులా ఉండే పొగ శరీరం పై పేరుకుపోయే లక్షణం ఉంటుంది. బంగారం పని చేస్తున్న చాలా మంది ఊపిరితిత్తులు, మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురవుతుంటారు. ఇప్పటికే చాలా షాపుల వారు జింక్ తోనే చేయిస్తున్నారు. వర్కర్లు కూడా అతుకులకు జింక్ తో చేయడం అలవాటు చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మొత్తం జింక్ తో చేసినవే ప్రజలు ఆదరిస్తారు. కావున బంగారం ఆభరణాలు జింక్ తో తయారైనవి కొనుగోలు చేయడం మంచిది..