మహేష్ బాబు 25 సినిమాల కలెక్షన్స్ చూస్తే మతిపోతుంది
చైల్డ్ ఆర్టిస్టుగా 8సినిమాలు చేసిన మహేష్ బాబు 1999లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు మూవీతో రంగప్రవేశం చేసాడు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసునిగా ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే తండ్రిని మించిన తనయుడిగా నిలిచాడు. అలా ప్రిన్స్ స్టార్ గా మొదలైన కెరీర్ సూపర్ స్టార్ గా ఎదిగి ప్రస్తుతం 25చిత్రాలు పూర్తిచేసుకున్నాడు. ఇండస్ట్రీలో అందరి హీరోలచేత పాజిటివ్ టాక్ తెచ్చుకుని యాంటీ ఫాన్స్ హీరోగా నిలిచాడు. రజతోత్సవ చిత్రంగా వచ్చిన మహర్షి డిఫరెంట్ కథతో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మహేష్ కెరీర్ లోనే కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతోంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్ గా 65కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటివరకూ మహేష్ నటించిన చిత్రాల తొలిరోజు కలెక్షన్స్ చూద్దాం.
తొలిచిత్రం రాజకుమారుడు 1999లో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయగా, తొలి రోజు 50లక్షల గ్రాస్ వసూలు చేసింది. 2000లో వచ్చిన యువరాజు మొదటి సినిమాను బ్రేక్ చేస్తూ, 65లక్షల గ్రాస్ వసూలు చేసింది. అయితే మూడవ చిత్రం వంశీ బాక్సాఫీస్ దగ్గర 30లక్షల లోపు వసూలు చేసి, పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇదే సినిమాలో నటించిన నమ్రతను మహేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక 2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ తెరకెక్కించిన మురారి మూవీ మహేష్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. తొలిరోజు 75లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
అయితే తర్వాత టక్కరి దొంగ 40లక్షలు, , బాబీ 35లక్షల గ్రాస్ తో ఈ రెండు మూవీస్ ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక 2003లో గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఒక్కడు మూవీ మహేష్ కెరీర్ ని మలుపు తిప్పింది. తొలిరోజు కోటి రూపాయలకు పైనే వసూలు రాబట్టి మైలురాయిగా నిల్చింది. ఇక అదే ఏడాది వచ్చిన నిజం మూవీ డిజాస్టర్ అయింది. నంది అవార్డు దక్కినప్పటికీ తొలిరోజు 30లక్షల గ్రాస్ కూడా రాకుండా అతి తక్కువ కలెక్షన్ చేసిన చిత్రంగా నిలిచింది.తర్వాత వచ్చిన నాని కూడా విమర్శల పాలైంది. 50లక్షల గ్రాస్ కే పరిమితం అయింది.
తర్వాత వచ్చిన అర్జున్ మూవీ సత్తా చాటుతూ తొలిరోజు కోటికి పైనే గ్రాస్ వసూలు చేసింది. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 2005లో వచ్చిన అతడు మూవీ తెలుగునాట మాత్రమే కాదు విదేశాల్లో కూడా మన్ననలు పొంది, రెండు కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక సినిమా ఇండస్ట్రీలో హిట్ గా నిల్చిన పోకిరి మూవీ దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద హిట్ గా చరిత్ర సృష్టించింది. తొలిరోజు 2.1 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా ఈమూవీ 66కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సైనికుడు మూవీ 1.5కోట్ల గ్రాస్ తెస్తే,అతిధి మూవీ 2.5కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అయితే మూవీ మాత్రం నిరాశ పరిచింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన ఖలేజా తొలిరోజు 4.3కోట్లు గ్రాస్ వసూలు చేసింది. తర్వాత దూకుడు మూవీ తొలిరోజు 9కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిల్చింది.
అలాగే బిజినెస్ మ్యాన్ మూవీ 18కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. 2013లో వెంకటేష్ తో కల్సి చేసిన మల్టీస్టార్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ 6.54కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఆతర్వాత సుకుమార్ తీసిన వన్ నేనెక్కడినే మూవీ తొలిరోజు 9కోట్లు రాబట్టింది. ఆగడు చిత్రం 9.71కోట్లు వసూలు చేసింది. 2015లో కొరటాల శివ తెరెకెక్కించిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదుచేసుకుని, వరల్డ్ వైడ్ గా తొలిరోజు 30.14కోట్లు వసూలు చేసి, మహేష్ కెరీర్ లో భారీ విజయాన్ని అందించింది. బ్రహ్మోత్సవం మూవీ అందరినీ నిరాశపరిచినా,తొలిరోజు 17కోట్లు కలెక్ట్ చేసింది. మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్పైడర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 16.2 కోట్లు వసూలు చేసింది. ఇక గత ఏడాది కొరటాల తెరకెక్కించిన భరత్ అను నేను మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్ గా 55కోట్ల గ్రాస్ వసూలు చేసింది.