టెంపర్ మూవీ మూడు రకాలైన క్లైమాక్స్ లు ఎలా మార్చేసారో చూడండి
ఒక్కోసారి సినిమా బాగుండకపోయినా కథ అదరగొట్టేస్తుంది. ఒక్కోసారి కథ బాగోకపోయినా సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఆడియన్స్ ఇష్టాఇష్టాలను బట్టి స్క్రీన్ మీద సినిమా సంగతి తేలిపోతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా పెద్దగా హిట్ కాలేకపోయినా కథ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. తెలుగునాట బాగానే కనెక్ట్ అయిన ఈ కథ మరిన్ని భాషల్లో సినిమాగా వచ్చేసింది. హిందీ , కన్నడ, తమిళం లతో పాటు మరిన్ని భాషల్లో టెంపర్ కథ తెరకెక్కింది.
అయితే ఆయా భాషల్లో చాలావరకూ కథను మార్చేశారు. వాళ్లకి ఇష్టం వచ్చిన రీతిలో మార్చుకున్నారు. ఇలా వరుస రీమేక్ లతో టెంపర్ దుమ్మురేపింది. హిందీలో సింబాగా ఈ మూవీ వచ్చింది. రణవీర్ సింగ్ మంచి హిట్ అందుకున్నాడు. తెలుగులో తారక్ ఇగో గల పోలీసాఫీసర్ గా కనిపిస్తే,హిందీలో రణవీర్ సింగ్ కమెడియన్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడు. ఇక హిందీలో కోర్టు శీను ఉండదు. అమ్మాయిని రేప్ చేసిన విలన్స్ తమ్ముళ్లను పోలీస్ స్టేషన్ లోనే లేపేస్తాడు. అయితే కోర్టు ఓ కమిటీ వేస్తుంది. అందులో అజయ్ దేవగన్ ఉంటాడు. హీరో ఎలాంటి పరిస్థితుల్లో విలన్స్ ని చంపాడో తెలుసుకుని హీరోని నిర్దోషిగా ప్రకటిస్తారు.
కాగా అయోగ్య పేరిట తమిళనాట రీమేక్ అయింది. తాజాగా రిలీజయిన అయోగ్య మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. విశాల్ హీరోగా చేసాడు. రాశీఖన్నా హీరోయిన్ గా చేసిన అయోగ్య మూవీ ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చింది . ఎట్టకేలకు మే 11న ఆడియన్స్ ముందుకు వచ్చింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విశాల్ కి మరో బిగ్ హిట్ వచ్చినట్లయింది. తమిళ క్లైమాక్స్ వరకూ తెలుగులో మాదిరిగా ఉంటుంది. అయితే ఆఖరులో హీరోకి కూడా ఉరిశిక్ష వేస్తారు. తెలుగులో హీరోకి ఉరిశిక్ష పడినా ఆగిపోతుంది. తమిళంలో మాత్రం ఉరిశిక్ష పడి హీరో చనిపోతాడు. ఇలా ఒకే కథను రకరకాలుగా మార్చి సూపర్ హిట్ అందుకున్నారు.