ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు ?
చీమలు, ఈగలు మొదలైన కీటకాలకు ఆహారంగా బియ్యప్పిండితో ఇంటి ముందు ముగ్గువేస్తారు. మరొక కారణం ఎమంటే, ఆడవారు వంగి ముగ్గు వెయ్యటం వలన వారు సంతానొత్పత్తి వ్యవస్త, కడుపుకి సంభందించిన అనేక సమస్యల నించి దూరంగా ఉండవచ్చును .“అతిధి దెవో భవాః…” అని మాటలలొనే కాదు, చేతలలో కూడా చూపిస్తాము.
ముగ్గుని పలు ప్రదేశాలలో పలు విధాలుగా పిలుస్తారు. రంగోలి అని చాలా ప్రదేశాలలో ముఖ్యంగా ఉత్తర దేశంలో, రంగవల్లి అని కర్నాటకలో, కేరలలో, చౌకుపురానా అని మధ్యప్రదెశ్లో, మదన అని రజస్తానులో, అరిపన అని బిహార్లో, అల్పన అని బెంగాలులో, కోలం అని తమిళనాడులో, ఇలా పలు రకాలుగా పిలుస్తారు.