సింగర్ కల్పన నటించిన సినిమాలెన్నో తెలుసా?
శాస్త్రీయ సంగీతమైనా,హిందుస్తానీ అయినా,ఫోక్ అయినా, రాక్ అయినా సింగర్ కల్పన గొంతునుంచి అద్భుతంగా పలికించగల సంగీత సరస్వతి. ఈమె తమిళ అమ్మాయి. ఈమె తండ్రి టీఎస్ రాఘవేంద్రన్. ఆయన నటుడే. తల్లి సులోచన మంచి గాయకురాలు. చెల్లి ప్రసన్న కూడా సింగరే. 5వ ఏటనుంచే సంగీతం మొదలు పెట్టిన కల్పన ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మధురై పిళ్ళై శ్రీనివాసన్ దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకుంది. ఎంతటి కష్టమైన రాగాలను అయినా అవలీలగా తన గొంతులో పలికిస్తుంది. సంగీతంలో మాదిరిగా విద్యలో కూడా ఆమెది అగ్రస్థానం.
ఎంసీ ఆయుర్వేదిక్ మెడిసిన్ చదివిన కల్పన ఆ తర్వాత లవ్ చేసి పెళ్లిచేసుకుంది. ఆమె పేరు ప్రఖ్యాతులు చూసి భర్త భరించలేకపోయేవాడు. మానసికంగా, శారీరకంగా తీవ్రంగా బాధించేవాడట. ఇక భరించలేక విడాకులు ఇచ్చేసిన కల్పన ఒంటరిగా ఉంటూనే అందివచ్చిన పాటలను పాడుతూ ఎన్నో విదేశీ భాషలు కూడా నేర్చుకుని వరల్డ్ వైడ్ సింగర్ గా ఎదిగింది. మళయాళం, జర్మన్, ఇటాలియన్,స్పానిష్,అరబిక్ భాషల్లో ఆమె కృషి పట్టుదలతో నేర్చుకుంది.
బాధించే భర్త నుంచి విడిపోయి,తనవ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుని, శాడిస్ట్ భర్తకు సమాధానం ఇచ్చింది. అలా ఎదిగి గెలిచిన కల్పన పడిలేచిన కెరటమే.
ఇక రైటర్ గా, సింగర్ గానే కాకుండా ఓ నటిగా కూడా ఆమెకు చరిత్ర ఉందని చాలామందికి తెలీదు. చిన్నతనంలో వాళ్ళ అమ్మమ్మ డాన్స్ నేర్పించేవారట. ఆసమయంలో మళయాళ దర్శకుడు ఐవి శశి ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతుంటే, కల్పనను కూడా వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్లారట. అక్కడ 28మంది చైల్డ్ ఆర్టిస్టులు వస్తే అందులో కల్పన సెలక్ట్ అయిందట. ఆవిధంగా సినిమాల్లో నటించడం మొదలు పెట్టి, తెలుగు తమిళ, మళయాళ భాషల్లో చైల్డ్ ఆర్టిస్టుగా 25సినిమాల్లో నటించింది.