Politics

తెరపైకి Y.S.Jagan బయో పిక్

దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ను ప్రధానంగా ఎంచుకుని డైరెక్టర్ మహీ రాఘవ తెరకెక్కించిన యాత్ర మూవీ బానే క్లిక్ అయింది. ఆనందో బ్రహ్మ వంటి హిట్స్ ఇచ్చిన మహీ రాఘవ యాత్ర మూవీ చేసి వైఎస్ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. ఎన్నికలముందు రావడంతో మంచి టాక్ తో నడిచింది. ముమ్ముట్టి ప్రధాన పాత్రలో అచ్చం డాక్టర్ వైఎస్ ని మరిపించారన్న టాక్ బాగా వచ్చింది. రాజన్న మళ్ళీ బతికి వచ్చాడన్న ఫీలింగ్ అభిమానుల్లో డైరెక్టర్ కలిగించాడు. 

తనదైన శైలిలో సీన్లను పండించడంలో మహీ వి రాఘవ సక్సెస్ అయ్యాడు. ఇక పాదయాత్ర చేసి ఇప్పుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చన నేపథ్యంలో యాత్ర సీక్వెల్ తీస్తానని డైరెక్టర్ మహీ రాఘవ అంటున్నాడు. వైఎస్ ని సీఎం గా చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్రను తెరకెక్కించి సక్సెస్ అందుకోవడంతో,ఇక జగన్ సీఎం కావడానికి దోహద పడిన ప్రజా సంకల్ప యాత్రను బేస్ చేసుకుని యాత్ర -2 తీస్తానని మహీ వి రాఘవ అంటున్నాడు. 

జగన్ పార్టీ వైస్సార్ సిపి విజయం పట్ల మహీ వి రాఘవ ట్విట్టర్ లో అభినందనలు చెబుతూ యాత్ర 2కి సంబంధించి ఓ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు. మీరు ఒకే అంటే నేను ఒకే అంటూ సైగ చేసాడు. అయితే డాక్టర్ వైఎస్ యాత్ర మూవీకి అనుమతి దొరికినంత ఈజీగా జగన్ యాత్రకు అనుమతి దొరుకుతుందని గ్యారంటీ లేదు. పార్టీ అధినేత గా కన్నా ప్రభుత్వ అధినేతగా ఉన్న సమయంలో కాంట్రవర్సీ లకు జగన్ ఛాన్స్ ఇస్తాడన్న నమ్మకం లేదు. పైగా పవర్ లోకి వచ్చిన వెంటనే ఇలాంటి వాటికి ముగ్గుచూపితే సిన్సియారిటీ మీద జనం లో నెగిటివ్ వస్తుందని కూడా జగన్ కి తెల్సు. మరి యాత్ర 2ఊహాగానే ఉంటుందా ఆచరణలోకి ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం.