Politics

ఖజానా అంతా బాబు ఎలా ఖాళీ చేసారు…. ఎలా జరిగింది…!

అధికారం అంటే ముళ్ళ కిరీటం లాంటిదని అంటూంటారు. ఇప్పుడు సరిగ్గా వైఎస్ జగన్ కి అర్ధమవుతోంది. ఎపి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అందుకుని ,ఎపి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి,సీఎం కుర్చీలో కూర్చున్నాక అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. షాక్ మీద షాక్ తగిలినట్లు ఆర్ధిక పరిస్థితి కనిపిస్తోంది. ఇక జూన్ నెల వచ్చేసింది. ఖర్చులు చూస్తే దిమ్మతిరుగుతోంది. 
ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వాలి. వికలాంగులు,వృద్ధులకు సామాజిక పెన్షన్స్ అందించాలి.

ఇందుకోసం తక్షణం 5వేలకోట్ల వరకూ కావాలి. సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్ విషయానికి వస్తే 1200కోట్లు అవసరం అవుతాయి. ఖజానా ఖాళీ అయిపొయింది. కేవలం ప్రభుత్వం దగ్గర 100కోట్లు మాత్రమే ఉంది. ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ,అన్నదాత సుఖీభవ పథకాలకు ప్రాధ్యాన్యత ఇవ్వడం వలన ఖజానా నిండుకుంది. 

బడ్జెట్ కి అనుగుణంగా ఖర్చులను అదుపులో ఉంచితే నిజంగా ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని అంటున్నారు. ఫలితంగా ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇది తప్ప మరో మార్గం లేదు. గత ప్రభుత్వం ఆఖరి క్షణంలో తీసుకున్న నిర్ణయాల వలన ఆర్ధిక పరిస్థితి ఇరకాటంలో పడిందని అధికారులు అంటున్నారు. చంద్రబాబు వేసిన దెబ్బకు జగన్ కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కష్టాల కడలి దాటితే రాబోయే రోజుల్లో జగన్ కి తిరుగుండదని అంటున్నారు. మరి ఎలా అధిగమిస్తారా చూడాలి.