ఒకప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా?
ఇప్పుడు హీరోయిన్స్ అంటే ఒకటి రెండు సినిమాలతో అవుట్. కొత్త హీరోయిన్ లేకపోతె తమ అభిమాన హీరో సినిమా చూడలేని పరిస్థితి. కానీ ఒకప్పుడు హీరోయిన్ అంటే పాతిక ముప్పై సినిమాలు గ్యారంటీగా ఉండేవి. హిట్ ఫెయిర్ జంటలు ఉండేవి. ఇక ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించిన ఆమె ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. ఆమె పేరు కీర్తీచావ్లా. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ,కన్నడ భాషల్లో కూడా నటించింది.
కీర్తీచావ్లా పేరుచెప్పగానే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో వివి వినాయక్ డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆది సినిమా గుర్తుకు వస్తుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ గల ఆ సినిమాలో జూనియర్ పక్కన నందు క్యారెక్టర్ లో నటించింది. ఇక ఈ సినిమాలో ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’అనే పాట ఈమె కోసమే రాశారా అనిపిస్తుంది. కుర్రకారు అప్పట్లో ఇమే అందానికి ఫిదా అయ్యారు. అంతలా తన అందంతో తెలుగుతెర ప్రేక్షకుల్ని తన అందంతో కట్టిపడేసింది.
ఇక ఆ సినిమా హిట్ తర్వాత కీర్తీచావ్లా హీరోయిన్ గా ఓ రేంజ్ లో వెలిగిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయిపొయింది. కారణం రెండో సినిమాకే విపరీతంగా లావెక్కిపోయింది. దీంతో స్టార్ హీరోల సరసన కాకుండా ఐటమ్స్ సాంగ్స్ కి పరిమితం కావల్సిన పరిస్థితి వచ్చేసింది. శ్రావణ మాసం, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు, సాధ్యం ,బ్రోకర్ వంటి మూవీస్ లో నటించింది. అయితే ఇవి కూడా ఘోరంగా డిజాస్టర్ అవ్వడంతో రానురాను ఛాన్స్ లు తగ్గిపోయాయి. దీంతో బిగ్రేడ్ సినిమాల్లో నటించేందుకు ఈ భామ రెడీ అయింది. అందుకే సినిమా ఫీల్డ్ లో ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలీదు.