స్టాక్ బ్రోకర్ స్థాయి నుండి క్యాబినెట్ మినిష్టర్ వరకు ఎలా ఎదిగారో చూడండి
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో తెలీదు. బళ్ళు ఓడలు,ఓడలు బళ్ళు అవుతాయని అందుకే అన్నారు. ఇప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్థానం చూస్తే మనందరికి ఆశ్చర్యం వేస్తుంది. ప్రధాని మోడీ రెండోసారి ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా కేంద్ర హోమ్ మంత్రిగా అమిత్ షా ప్రమాణ స్వీకారం చేసారు. బాధ్యతలు కూడా చేపట్టారు. నిజానికి గుజరాత్ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా మోడీ, షా కాంబినేషన్ ఓ సంచలనమే. అమిత్ షా వ్యూహం అంటూ వార్తా కథనాలు వస్తుంటాయి. అయితే ఇంతటి చాకచక్యం గల షా గురించి వివరాల్లోకి వెళ్తే ఎన్నో ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తాయి.
బీజేపీలో కీలక పాత్ర పోషిస్తూ వ్యూహాలు అమలు చేసే అపర చాణక్యునిగా గుర్తింపు పొందిన షా జీవితం లోకి వెళ్తే,1989నుంచి ఇప్పటివరకూ స్థానిక సంస్థల ఎన్నికలతో కలిపి ఏకంగా 29ఎన్నికల్లో పోటీచేసారు. ఏ ఒక్క ఎన్నికలో కూడా ఓటమి చవిచూడలేదు. 1997,1998,2002,2007లో మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక రాష్ట్ర మంత్రిగా 12శాఖలను నిర్వహించడం విశేషం. హోమ్,లా అండ్ ఆర్డర్,జస్టిస్,జైళ్లు,సరిహద్దు భధ్రత ,పౌర రక్షణ,ఎక్సయిజ్,ప్రొహిబిషన్, హౌసింగ్,అసెంబ్లీ వ్యవహారాలు వంటి శాఖలను నిర్వహించారు. ఇప్పుడు ప్రధాని మోడీ తర్వాత నెంబర్ టు పొజిషన్ లో అమిత్ షా ఉన్నారు.
మంచి వ్యూహకర్తగా పేరొందిన షా నిజానికి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ గా స్టార్ట్ అయింది. స్టాక్ బ్రోకర్ అని కూడా అంటారు. 2010లో షాబుద్దీన్ కేసులో కొన్ని రోజులు జైలు జీవితం గడిపారు. గుజరాత్ కాకుండా ఎక్కడైనా ఉండాలంటూ షరతులతో కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఢిల్లీలోని గుజరాత్ భవన్ లో తలదాచుకున్నారు. సబర్మతి జైలు నుంచి విడుదలవుతూ ప్రస్తుతం రాష్ట్రం విడిచి వెళుతున్నా,ఏదో ఒకరోజు తప్పనిసరిగా వస్తానని షా చెప్పుకొచ్చారు. ఆతరువాత నాలుగేళ్లకు బిజెపి జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యాక చాలా రాష్ట్రాల్లో బిజెపి విజయ కేతనం ఎగురవేసింది. 2016లో మహారాష్ట్ర,జమ్మూ కాశ్మిర్,హర్యానా,జార్ఖండ్,అస్సాం రాష్ట్రాల ఎన్నికల్లో కమలం వికసించింది. అయితే ఢిల్లీ, బీహార్, ఛతీస్ ఘడ్,రాజస్థాన్,మధ్యప్రదేశ్ లలో బిజెపి ఓటమి చెందింది. ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ , గుజరాత్ లలో బిజెపి గెలుపు వెనుక అమిత్ షా వ్యూహం పనిచేసింది.