Lakshmi devi Anugraham:లక్ష్మి దేవి అనుగ్రహం లేదా ….అయితే ఈ తప్పులు అసలు చేయకండి
నగదును తూర్పు దిక్కులో లాకర్ లో పెట్టాలి. నగదును ఎప్పుడు దక్షిణ దిక్కుగా పెట్టకూడదు. అలాగే బాత్ రూమ్ ఎదురుగ డబ్బును భద్రపరిచే లాకర్ ని పెట్టకూడదు. లాకర్ ని ఎప్పటికప్పుడు దుమ్ము,ధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి. కొంతమంది లాకర్ లో లక్ష్మి దేవి ప్రతిమ లేదా ఫోటో పెడుతూ ఉంటారు. అలంటి వారు లక్ష్మి దేవి పక్కన రెండు ఏనుగులు ఉన్న ప్రతిమ లేదా ఫోటో పెట్టుకోవాలి. మంగళవారం అప్పు ఇవ్వకూడదు. అప్పు తీసుకోకూడదు.
ఇలా చేస్తే లక్ష్మి దేవి అలిగి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. వంటగది ఈశాన్యంలో కట్టకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు కారణం ఇంట్లో ధన లక్ష్మీ నిలవదనే అలా చెబుతారు. ఆలా కడితే లక్ష్మీ అలిగి వెలిపోతుందంట. సాయంకాలం నిద్రించే వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. సోమరిగా ఉండే వారి ఇంట్లో కూడా లక్ష్మి దేవి ఉండదు. ప్రతి రోజు నిత్య దీపారాధన చేయాలి. ఆలా చేయని వారి ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.