Politics

జగన్ పిఎ నాగేశ్వర రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

సీఎం కి పిఎ అంటే సీఎం కంటే ముందుగానే రియాక్ట్ అవుతూ అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి. అందునా ఎపి నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడుకి తగ్గ పిఎ అంటే ఇక చెప్పక్కర్లేదు. మరి ఆ పోస్టులోకి ఎవరు వస్తారా అని అనుకుంటున్న తరుణంలో తనకు అంత్యంత సన్నిహితుడు,నిత్యం తనవెంట ఉండే వ్యక్తిని తన పిఎ గా జగన్ సెలక్ట్ చేసుకున్నారు. 

జగన్ వెంట దాదాపు 11ఏళ్లుగా ఉంటున్న కె నాగేశ్వర రెడ్డిని తనకు పీఏగా ఎంపిక చేసుకుంటూ ఉత్తర్వులు కూడా జారీచేశారు. వివిధ మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం గల నాగేశ్వర రెడ్డి అనునిత్యం జగన్ వెంటే ఉంటూ వచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో అతడు కీలక పాత్ర వహించాడు. జగన్ మనసెరిగి పనిచేసుకు పోవడం అతడి నైజం. 

విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి జరిగిన సమయంలో జగన్ పక్కనే నాగేశ్వర రెడ్డి ఉన్నాడు. 
వివిధ వర్గాలతో సమావేశం ఏర్పాటు చేయించడంలో నాగేశ్వర రెడ్డికి మంచి పట్టుంది. జగన్ కి ఎప్పుడు ఏది అవసరమో ,ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాగేశ్వర రెడ్డికి పూర్తిగా అవగాహన ఉంది. ఇక పులివెందుల సీఎం క్యాంప్ కార్యాలయ పీఏగా డి రవిశంకర్ ని ఎంపిక చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎప్పటినుంచో తన వెంట వుండే వారికే జగన్ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.