Movies

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ వ్యాపారంలో ఏ రేంజ్ కి చేరిందో తెలుసా

 మొదట్లో మోడలింగ్ లో అదరగొట్టి,ఆతర్వాత హాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి,సౌత్ ఇండియాలో కి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా అవతారం ఎత్తిన సిమ్రాన్ అనగానే అప్పట్లో కుర్రకారు ఎలా ఉండేదో వేరే చెప్పక్కర్లేదు. తన అందంతో మతి పోగొట్టిన సిమ్రాన్ ముందుగా అబ్బాయిగారి పెళ్లి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మోడ్రన్ డ్రెస్ లోనే కాకుండా చీరకట్టులోనూ సెక్సీ లుక్ లో కనిపించే ఈ ముద్దుగుమ్మ తెలుగులో అగ్ర హీరోయిన్ గా నిలబడింది. స్లిమ్ గా ఉండే శరీరమే ఆమె విజయ రహస్యం. 

నటనలో ఏ సీన్ అయినా పండించగల సిమ్రాన్ 1998నుంచి 2004వరకూ తమిళ ,తెలుగు సినీ రంగాలను ఏలేసింది. మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున,వెంకటేష్,బాలకృష్ణ ఇలా అగ్ర హీరోల సరసనే కాకుండా చిన్న హీరోలతో సైతం నటించి సిమ్రాన్ తన సత్తా చాటుకుంది. ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సంపాదనపై కాకుండా ప్రేమకు విలువ ఇచ్చింది. చిన్ననాటి ఫ్రెండ్ దీపక్ బగ్గాను పెళ్ళాడి, సినిమాలు తగ్గించేసి, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. 2008లో రీ ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ హీరోయిన్ గా ఒక్క మగాడు,జాన్ అప్పారావు, 40ప్లస్ వంటి మూవీస్ లో నటించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు చేస్తూనే సొంత వ్యాపారంపై దృష్టి పెట్టింది.

సిమ్రాన్ అండ్ సన్స్ పేరిట భర్త తో కల్సి ప్రొడక్షన్ స్టూడియో పెట్టింది. ఇప్పటికే రెండు సంస్థల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి వాటి నిర్వహణ బాధ్యతలను భర్తకు అప్పగించింది. తద్వారా సినీ కెరీర్ కి ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. ఇద్దరు పిల్లలు పుట్టినా వన్నె తరగని అందం సిమ్రాన్ సొంతం. అయితే ఛాన్స్ లు తగ్గడంతో తెలుగు ,తమిళ టివి సీరియల్స్ లో నటించింది. టివి షోస్ లో పాల్గొంది. అంతేకాదు క్యారెక్టర్  ఆర్టిస్ట్ గా మారి తమిళంలో నటిస్తోంది. తెలుగు సినిమాల్లో అతిధి పాత్రలలో కనిపిస్తోంది. 2018లో తమిళ సూపర్ స్టార్ రంజనీకాంత్ సరసన పెటా  సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు విలన్ పాత్రలపై  ఆసక్తి కనబరుస్తోంది. ఎందుకంటే హీరోలే విలన్స్ గా నటిస్తుంటే తానెందుకు చేయకూడదని అంటోంది. కథ, పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తమిళ యువ హీరో శివ కార్తికేయన్ సినిమాలో విలన్ గా నటిస్తోంది. నటి అన్నాక అన్ని పాత్రలు చేయాలని అంటోంది.