Movies

పసుపు కుంకుమ సీరియల్ హీరోయిన్ పల్లవిని బ్యాన్ చేయటానికి కారణం ఇదే !

సినిమాల్లో కంటే సీరియల్స్ లో నటిస్తేనే మరింత గుర్తింపు ,రాణింపు వస్తుందంటారు. అవును పల్లవి గౌడ కూడా అలానే గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి ఈమె యానిమేటర్ కావాలని అనుకుని యాక్టర్ అయింది. పసుపు కుంకుమ సీరియల్ ద్వారా పరిచయం అయిన ఈమె అంజలి క్యారెక్టర్  తో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరైంది. ఈ సీరియల్ లో నటించిన సహనటి అలీ అంటే తనకు ఇష్టమని చెబుతోంది. అయితే ఈటీవీలో సావిత్రి సీరియల్ లో నటించినా కొన్ని కారణాల వలన తప్పు కున్నప్పటికీ ఫిదా డబ్బింగ్ సీరియల్ తో అలరిస్తోంది. అయితే తెలుగులో రీ ఎంట్రీ వస్తే చేస్తానని, ముఖ్యంగా జి తెలుగులో నటించడం అంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది.
 

అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని చెప్పే పల్లవి పసుపు కుంకుమ సీరియల్ చేసే సమయంలో డాన్సర్ గోకుల్ ని ఇష్టపడిందట. మొత్తం మీద ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీళ్లిద్దరు కల్సి జి తెలుగులో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఇక ఆతర్వాత వీరిద్దరూ కల్సి ఎక్కడా కనిపించలేదు. తన షోషల్ మీడియాలో కూడా భర్తకు సంబంధించిన ఫొటోస్,న్యూస్ ఎక్కడా షేర్ చేసుకోలేదు. అయితే కొంతకాలం క్రితం మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అందుకే ఇప్పుడు సింగిల్ అని చెప్పిన పల్లవి తన లైఫ్ ని ఎవరితోనైనా కొనసాగించడానికి ఇబ్బందిలేదని,దానికి సమయం రావాలని చెబుతోంది.

భర్తతో విడాకుల తర్వాత బిజీ బిజీగా షూటింగ్స్ తో గడిపి  చేదు అనుభవాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది. ‘సావిత్రి సీరియల్ లో నటించేటప్పుడు వేరే ఏ తెలుగు సీరియల్ లో నటించకూడదని ఉన్న అగ్రిమెంట్ పై సంతకం చేసాను. కానీ నాకు ఇవ్వాల్సిన పేమెంట్స్ సకాలంలో ఇవ్వలేదు. రెండు నెలల పేమెంట్ ఆగిపోయింది. దీంతో వేరే సీరియల్ లో ఛాన్స్ వస్తే చేస్తానని చెప్పడంతో వాళ్ళు ఒప్పుకోలేదు. పోనీ పేమెంట్ బకాయి ఇమ్మన్నా ఇవ్వలేదు. ఇక చేసేది లేక వేరే ప్రాజెక్ట్ ఒప్పుకుంటానని చెప్పడంతో నన్ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ బాన్ చేసింది’అని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్యూలో పల్లవి చెప్పింది.