సమాజసేవ కోసం ఈ హీరోయిన్స్ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా?
తాము సంపాదించిన దాంట్లో ఎంతోకొంత సమాజానికి ఇవ్వాలన్న ఆలోచన స్టార్ హీరోయిన్స్ లో బలంగా ఉంది. సామాజిక బాధ్యతతో కోట్ల రూపాయలు వెచ్చించి సేవలు అందిస్తున్నారు. చందమామ మూవీతో ఎంట్రీ ఇచ్చి ,వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా మారిన కాజల్ అగర్వాల్ తన సొంత డబ్బుతో పాటు విరాళాలు కూడా సేకరించి అరకులో స్కూల్స్ నిర్మాణం చేయించింది. ఇక మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా తనకు ప్రపంచ సుందరి అవార్డు గెలిచి 20ఏళ్ళు పూర్తయిన సందర్బంగా 2014లో 100మంది చిన్నారులకు ఉచితంగా సర్జరీలు చేయించింది. అవసరాల్లో ఉన్నవాళ్లకు సాయం అందిస్తోంది.
ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ముంబైలోని నానావతి హాస్పిటల్ లో కాన్సర్ రోగులకు ఓ వార్డు ఏర్పాటుచేయడానికి 50లక్షలు విరాళంగా ఇచ్చింది. ఇక యునిసిఫ్ తో కల్సి పిల్లల చదువులు,హక్కులపై అవగాహన కల్పిస్తోంది. అలాగే ఏం మాయ చేసావే మూవీతో ఎంట్రీ ఇచ్చి ఎన్నో హిట్ చిత్రాలలో తన సత్తా చాటిన సమంత, టాలీవుడు హీరో నాగ చైతన్యను పెళ్లాడింది. ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించిన సమంత తాను చేసే యాడ్స్ ద్వారా వచ్చే సొమ్ముని కేటాయిస్తోంది. ఈ సంస్థ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేదపిల్లలకు,మహిళలకు ఉచితంగా వైద్యం చేయిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
స్వచ్ఛంద సంస్థలకు ఆర్ధిక సాయం చేయడంలో ముందువరుసలో ఉండే దీపికా పడుకొనే ప్రకటనల ద్వారా సంపాదించిన దానితో స్వచ్ఛంద సంస్థలకు ఖర్చుచేస్తోంది. మానసిక సమస్యలతో సతమతమయ్యేవారికి చికిత్స చేయిస్తోంది. ఇక శృంగార తారగా పేరొందన సిన్నీలియోన్ ముంబయిలోని పేద విద్యార్థులకు భారీగానే ఆర్ధిక సాయం అందిస్తోంది. వృద్ధులను,వృద్ధ దంపతులను దత్తత తీసుకుని వాళ్ళ బాగోగులను చూస్తోంది. బబ్లీ బ్యూటీగా పేరొందిన హన్సిక తన సొంత డబ్బుతో 25మంది పేద విద్యార్థులను చదివిస్తోంది. రొమ్ము కేన్సర్ తో బాధపడుతున్న 10మంది మహిళల వైద్య ఖర్చు కూడా భరిస్తోంది.