జనసేన ఓడిపోవడానికి పది ముఖ్యమైన కారణాలు ఇవే..!
ఎన్నికల ముందు జనసేన ప్రభావం గట్టిగా కనిపించింది. కానీ ఫలితాలకు వచ్చేసరికి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఈ ఎన్నికలలో జనసేన ఒక్క సీటుకే పరిమితమైంది. అంతేకాదు జనసేన అధినేత పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. అయితే ఎన్నికలలో ఓటమిని పకన పెట్టిన పవన్ అసలు వెనుకంజ వేసేది లేదని రాజకీయాలలో మక్కువతో ఇందులోకి రాలేదని సమాజంలో మార్పు తీసుకురావడం కోసం రాజకీయాలలోకి వచ్చానని గెలిచినా ఓడినా నా తుదిశ్వాస వరకు ప్రజలతోనే ఉంటానని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పాడు. అంతేకాదు పార్టీ పెట్టినప్పుడే ఓటమి ఉంటుందని తెలుసుకున్నానని ఓటమి బాధతో నమ్ముకున్న జనాన్ని వదిలేసి వెళ్ళడం జన సైనికుడి లక్షణం కాదని నా తుది శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన ఓడిపోవడానికి పది ముఖ్యమైన కారణాలు ఇవే..!
1) రాజకీయంగా అనుభవం లేకపోవడం
2) జనాలలోకి వెళ్లకపోవడం
3) చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎఫెక్ట్
4) సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకోవడం
5) సొంత ఛానళ్ళు, పత్రికలు జనసేనకు లేకపోవడం
6) 2014లో టీడీపీకి మద్దతివ్వడం
7) జగన్ని విమర్శించడం
8) సరైన అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం
9) సొంత నియోజకవర్గంలో ఎక్కువగా కనిపించకపోవడం
10) నాయకుడిగా పేరు సంపాదించుకోకపోవడం