విజయ్ దేవరకొండ గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు
టాలీవుడ్ లో హీరోల వారసులు ఏలేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బయట వాళ్ళు నిలదొక్కుకోవడం చాలా కష్టంగా మారింది. అయితే విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు తమ సత్తా చాటేస్తున్నారు. అర్జున్ రెడ్డి మూవీతో యూత్ క్రేజీ హీరోగా అవతరించిన విజయ్ దేవరకొండ ఆతర్వాత గీత గోవిందం మూవీతో వందకోట్ల కలెక్షన్ హీరోగా మారిపోయాడు. 1989మే9న హైదరాబాద్ లో గోవర్ధనరావు,మాధవిలకు పుట్టిన విజయ్ తండ్రి నాగర్ కర్నూల్ కి చెందిన వ్యక్తి. సినిమాలపై ఇష్టంతో హైదరాబాద్ వచ్చారు. నటుడిగా ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఛాన్స్ లు రాకపోవడంతో డైరెక్టర్ విభగంలో చేరిపోయాడు. దూరదర్శన్ తో సహా అనేక టివి ఛానల్స్ లో సీరియల్స్ కి గోవర్ధనరావు పనిచేసారు. 1988లో మాధవితో పెళ్లవడం ఏడాదికే విజయ్ పుట్టడం జరిగిపోయాయి.
విజయ్ ని పుట్టపర్తి సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివించారు. క్రమశిక్షణతో చదువు సాగించే ఆ పాఠశాలలో నే రచనపై పట్టు సాధించాడు. కొన్ని నాటకాల్లో వేసాడు. స్కూల్లో ఉండగా సినిమాలు చూసే ఛాన్స్ లేదు. బయటకు వెళ్లి చూడాలన్నా అనుమతి ఉండేది కాదు. హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాడు. భద్రుకా కాలేజీలో డిగ్రీలో చేరినప్పటికీ సరిగ్గా వెళ్లకపోవడంతో తండ్రి ఇష్టమైన రంగంలో చేరమని తండ్రి సూచించాడు. దీంతో సినిమా రంగంలో ఛాన్స్ ల కోసం ట్రై చేసాడు. నువ్విలా సినిమాలో రవిబాబు ఇచ్చిన చిన్న క్యారెక్టర్ ని విజయ్ చేసాడు. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఇక తల్లి నడిపే పర్సనాలిటీ డవలప్ మెంట్ క్లాస్ లకు వెళ్లి క్లాస్ లు చెప్పేవాడు. మేడం మీరేనా షార్ట్ ఫిల్మ్డ్ తీయడంతో పాటు మరికొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు.
ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాలో ఋషి పాత్ర చేసాడు. ఆతర్వాత మహానటి మూవీ కోసం సెలక్ట్ అయ్యాడు. ఇక పెళ్లి చూపులు సినిమాలో హీరోగా సెలక్ట్ అయ్యాడు. ఆ సినిమా చేస్తుండగా,అర్జున్ రెడ్డి మూవీ గురించి సందీప్ వంగా చెప్పడంతో ఓకే చెప్పాడు. ఇది తీస్తుండగానే మహానటి,ద్వారక సినిమాలు పట్టాలెక్కాయి. అయితే ద్వారకా విజయం అందుకోలేదు. అయితే అర్జున్ రెడ్డితో బాక్సాఫీసు రికార్డులు తిరగరాసాడు. సెన్సార్ బోర్డులో ఈ సినిమాపై వివాదం రావడం,సినిమా ఆలస్యం కావడంతో బోర్డుపై విజయ్ విమర్శలు కూడా చేసేసాడు.
ఇక తర్వాత వచ్చిన ఏం మంత్రం వేసావే చిత్రం నిరాశ మిగిల్చింది. గీత గోవిందం సినిమాలో నటించే ఛాన్స్ వస్తే,బాగోదేమోనని అనడం నిర్మాత నల్లమలుపు బుజ్జి నచ్చజెప్పడంతో విజయ్ ఒప్పుకున్నాడు. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మహానటిలో జర్నలిస్ట్ గా విజయ్ నటనకు జనం నీరాజనం పట్టారు. ఇక గీత గోవిందంతో దశ మారిపోయింది. నోటా మూవీ బోల్తా కొట్టినప్పటికీ టాక్సీ వాలా తో విజయం అందుకున్నాడు. డియర్ కామ్రేడ్ మూవీతో ఆడియన్స్ ని మెప్పించడానికి సన్నద్హమయ్యాడు.