MoviesUncategorized

పెద్దలు కుదిర్చిన వివాహాల్లోనూ ప్రేమ ఉంటుందని నిరూపించిన టాలీవుడ్ స్టార్స్

ఒకరినొకరు అర్ధం చేసుకునే గుణం ఉంటేచాలు ప్రేమ పెళ్లిళ్లే కాదు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా సక్సెస్ బాట నడుస్తాయి. ఇలాంటి పెళ్లిళ్లలో కూడా ప్రేమ నిండుగా ఉంటుంది. ఇందుకు ఎన్నో ఘటనలు కనిపిస్తాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో కూడా ఇది రుజువైంది. నందమూరి నటవారసుడిగా తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,లక్ష్మి ప్రణతిల వివాహం తీసుకుంటే, పెద్దలు కుదిర్చిన పెళ్లి. 2011మే5న ప్రణతి 19ఏళ్ళ ప్రాయంలో తారక్ తో పెళ్లయింది. 18ఏళ్ళు నిండగానే అప్పట్లో ఆమెకు పెళ్లి చేయడంపట్ల పైగా ఇద్దరికీ తొమ్మిదేళ్ల వయస్సు తేడా ఉండడం పట్ల చాలా కామెంట్స్ వచ్చాయి. 

అయితే ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఇద్దరిమధ్యా ప్రేమ పుష్కలంగా ఉంది. ఇక తారక్,ప్రణతిలకు అభయ్ రామ్,భార్గవ రామ్ అనే ముద్దులొలికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్ పెళ్లి కూడా ఏరేంజ్డ్ మేరేజ్ యే. కామెడీ హీరోగా తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ కి చెన్నై కి చెందిన ఆర్కిటెక్ట్ 2015మే29న నిరూప తో పెళ్లయింది. ఈమెకు సినిమాలంటే అసలు అవగాహన లేదు. వీళ్లకు ఓ కూతురు ఉంది. అయితే పెళ్లికాక ముందు అల్లరి నరేష్ సినిమాలేవీ నిరూప చూడలేదు. 

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ , కళ్యాణ్ దేవ్ ల పెళ్లి కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లి. నిజానికి శిరీష్ భరద్వాజ్ అనే యువకుడితో ఆర్యసమాజ్ లో ప్రేమ పెళ్లి చేసుకున్న శ్రీజకు ఓ కూతురు పుట్టాక ఇద్దరి మధ్యా విబేధాలు రావడంతో విడాకులు తీసుకుంది. దీంతో పారిశ్రామిక వేత్త కళ్యాణ్ దేవ్ తో2017మార్చిలో పెళ్లి జరిపించారు. వాస్తవానికి పెళ్ళికి ముందు వీరిద్దరూ క్లాస్ మేట్స్ అవ్వడం విశేషం. వీరిద్దరికీ ఓ పాప ఉంది. ఇక కళ్యాణ్ దేవ్ సినిమా హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. 

ఒకప్పుడు హిట్ చిత్రాల దర్శకుడిగా రాణించిన స్వర్గీయ టి కృష్ణ కుమారునిగా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న గోపీచంద్ ,రేష్మ ల పెళ్లి కూడా పెద్దలు కుదిర్చింది. ప్రముఖ హీరో శ్రీకాంత్ మేనకోడలు, అమెరికాలో చదువుకున్న రేష్మను 2013మే12న పెళ్లాడాడు. వీరిద్దరికీ 8ఏళ్ళ వయస్సు తేడా ఉంది. వీరికి విరాట్ అనే బాబున్నాడు. అలాగే తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు సాయికుమార్ కుమారుడు ఆది పెళ్లి కూడా అరుణ అనే అమ్మాయితో జరిగింది. 

రాజమండ్రికి చెందిన అరుణతో 2014డిసెంబర్ లో ఆదికి పెళ్లయింది. వీరికి ముద్దులొలికే ఓ పాప ఉంది. తమిళ ఇండస్ట్రీలో చూస్తే ధనుష్ ,ఐశ్వర్య ల జంటది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లే. ఇండస్ట్రీలో ధనుష్ నిలదొక్కుకుంటున్న సమయంలోనే ఇద్దరికీ పెళ్లయింది. అయితే పెళ్ళికి ముందు ఇద్దరికీ పరిచయం ఉన్నా, ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించలేదు. కానీ పెళ్లయ్యాక ఇద్దరు ఎంతోప్రేమగా ఉంటున్నారు. 15ఏళ్ళ వైవాహిక జీవితంలో ఆత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలున్నారు.