MoviesUncategorized

అలనాటి హీరోయిన్ రాధిక ఎన్ని కష్టాలను అధికమించి ఈ స్థాయికి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

అలనాటి హీరోయిన్ రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాధిక ఎన్నో విజయవంతమైన సినిమాలను చేసింది. రాధిక 3 దశాబ్డల పాటు తిరుగు లేని నటిగా కొనసాగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమె హీరోయిన్ గా ఉంటూనే రాడాన్ సంస్థను స్థాపించి ఎన్నో సీరియల్స్,షోస్ చేసి టివి రంగంలో మకుటం లేని మహారాణి అయ్యింది. ఒకవిధంగా చెప్పాలంటే ఆమె టీవీ ప్రపంచాన్ని ఏలిందని చెప్పవచ్చు. రాధిక నిర్మించిన సీరియల్ ని ఒక్కరోజు చేసామంటే మరొక రోజు తప్పక చూడాల్సిందే. అంతలా సీరియల్ పక్కా స్క్రేన్ ప్లే తో ఉంటాయి. అయితే ఆమె నిజ జీవితంలో ఎన్నో కష్టాలను చవి చూసింది. సినీ రంగం,టీవీ రంగం, బిజినెస్ ఇలా అన్ని రంగాలలోను ఆమె విజయాలను సాధించింది.

కానీ నిజ జీవితంలో కొన్ని కష్టాలను పడింది. అయితే అసలు రాధిక సినీ రంగానికి ఎలా వచ్చిందని పరిశీలిస్తే ….రాధిక తండ్రి రాధా తమిళంలో స్టార్ కమెడియన్. ఆమె పెద్ద కూతురు. ఆమె చాలా చిన్న వయస్సులోనే హీరోయిన్ గా మారింది. రాధిక సినిమాల్లో నటిస్తూ ఉండగా నటుడు,దర్శకుడు అయిన ప్రతాప్ పోతన్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే వారి మధ్య కొన్ని మనస్పర్థలు రావటంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత రాధిక రిచర్డ్స్ ని వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప రియానా పుట్టాక విభేదాలు రావటంతో విడిపోయారు.

కొంత కాలం అయ్యాక రాధిక తనకు ఎంతో ఆప్తుడు అయినా శరత్ కుమార్ ని వివాహం చేసుకుంది. అప్పటి నుండి రాధికా వైవాహిక జీవితం హ్యాపీగా ఉంది. రాధిక తనకు వచ్చిన సమస్యలతో చిరునవ్వుతోనే పోరాటం చేసి విజయం సాధించారు. ఒక విధంగా చెప్పాలంటే రాధికను డైనమిక్ లేడి అని అనవచ్చు. రాధిక చెల్లెలు నిరోషా కూడా నటిగా చాలా సినిమాలను చేసింది. రాధిక కష్టాల్లో ఉన్న సమయంలో నిరోషా అండగా లేదనే చెప్పాలి. రాధిక, శరత్ కుమార్ లకు ఒక బాబు ఉన్నాడు.

రాధికా కూతురు రియానాకు ఈ మధ్యనే ఇండియన్ క్రికెటర్ అభిమన్యు తో వివాహం అయింది.
ఆమె హీరోయిన్ గా అగ్ర హీరోలందరితోను నటించింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్నాయి అనగానే రాడాన్ సంస్థను స్థాపించి టీవీ రంగంలో సీరియల్స్,రియాల్టీ షోస్ అంటే ఏమిటో రుచి చూపించి ప్రతి ఒక్కరు టీవీకి అతుక్కునేలా చేసిన ఘనత రాధిక కే సొంతం. ప్రస్తుతం రాధిక ఒక పక్క నచ్చిన సినిమాలను చేసుకుంటూ మరో పక్క సీరియల్స్ తో బిజీగా ఉంది.