ఎన్టీఆర్ కి డూప్ గా నటించిన ఈ నటుడు కూడా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు… ఎవరో తెలుసా?
సినీ రంగంలో ఎన్నో సంఘటనలు,ఆశ్చర్య ఘటనలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో స్వర్గీయ నందమూరి తారకరామారావు విషయంలో కూడా ఓ సంఘటన గురించి వివరాల్లోకి వెళ్తే, తెలుగు సినీ రంగానికి కన్ను లాంటివాడు. సినీరంగానికి నందమూరి,అక్కినేని రెండు కళ్లులాంటి వారని చెప్పక్క తప్పదు. ఎన్టీఆర్ ఎన్నో పాత్రలతో జనాన్ని మెప్పించారు. ఏ పాత్ర వేసిన అందుకు సరిగ్గా ఎన్టీఆర్ సరిపోయాడు అనేట్టుగా ఉండేది. ఈయన కోసమే ఆ పాత్ర ఉందా, ఆ పాత్రకోసమే ఈయన పుట్టాడా అన్నట్లు ఉండేది.
అయితే ఎంత గొప్ప నటుడికైనా మరో నటుడు అభిమానిగా ఉంటాడా అంటే, ఉంటాడనే విధంగా ఎన్టీఆర్ కి మరో నటుడు అభిమానిగా ఉండేవాడు. పైగా తమిళ సినీ ఆడియన్స్ మన్ననలు పొంది వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న స్టార్ హీరో కూడా అతడు. అతడే ఎంజీఆర్. తెలుగులో ఎన్టీఆర్ అభిమానులకు ఎలా ఆరాధ్య దైవమో , తమిళంలో ఎంజీఆర్ కూడా అంతేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ,ఎంజీఆర్ చాలా మంచి ఫ్రెండ్స్ కూడా. వీళ్లిద్దరి మధ్యా స్నేహం ఇంతదాకా వెళ్లిందంటే,ఎన్టీఆర్ కి ఎంజీఆర్ డూప్ గా చేసేవరకూ వెళ్ళింది.
కానీ ఓ అగ్ర హీరో అయివుండి కూడా ఎంజీఆర్ ఇలా డూప్ గా నటించాడు. 1953లో భానుమతి , ఎంజీఆర్ జంటగా శ్రీరాములు నాయుడు డైరెక్షన్ లో వేలై వెన్నయ్ అనే సినిమా తెరకెక్కింది. అదేసమయంలో తెలుగులో ఎన్టీఆర్ హీరోగా అగ్గిరాముడుగా తీశారు. ఈ రెండు సిన్మాలు కోయంబత్తూర్ లో షూట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కొన్ని సందర్భాల్లో లేట్ గా రావడంతో కొన్ని సన్నివేశాల్లో ఎంజీఆర్ తాను డూప్ గా చేస్తానని చెప్పి నటించారట. తమిళంలో పెద్ద హీరో అయినా, తోటి హీరో అంటే గల అభిమానంతో ఎలాంటి భేషజాలకు పోకుండా ఎంజీఆర్ ఇలా నటించి తన సహృదయతను చాటుకున్నాడు. తమిళనాడు కి ఎంజీఆర్ సీఎం గా చేస్తే, ఏపీకి ఎన్టీఆర్ సీఎం అయ్యాడు.