సౌందర్యకే తప్పలేదు నాడు మరి సాయి పల్లవికి సాధ్యం అవుతుందా?
ఒకప్పుడు భానుమతి,సావిత్రి వంటి హీరోయిన్స్ కళ్ళతోనే భావాలు పలికిస్తూ తమ అద్భుత నటనతో ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే రూల్స్ స్ట్రిక్ట్ గా ఫ్రేమ్ చేసుకున్న సాయిపల్లవికి కెరీర్ సాగడం ఇబ్బందేనని వినిపిస్తోంది. అయినప్పటికి సినిమాలు లేకున్నా పర్వాలేదని,నా రూల్స్ నాకున్నాయని సాయిపల్లవి తేల్చి చెప్పేస్తోంది. 200మిలియన్స్ కి పైనే వ్యూస్ సాధించిన రౌడీ బేబీ పాటలో ఒక ఇంచి కూడా నడుం, కూడా కనిపించకుండా కళ్ళు చెదిరే స్టెప్పులతో ఉర్రూతలూగించింది. అయితే ఎంతలేదన్నా కొన్ని సీన్స్ చేయకపోతే ఛాన్స్ లు కష్టమని అంటున్నారు.
అయితే డియర్ కామ్రేడ్ మూవీలో కూడా సాయిపల్లవిని అనుకున్నారట. లిప్ లాక్ సీన్ లో నో అనడంతో ఆ పాత్ర కాస్తా రష్మిక నందన్న తన్నుకుపోయింది. ఇక సూర్య ఎండీకే పాత్ర గురించి సాయిపల్లవిపై చాలామంది ట్రోల్స్ వేశారు. సూర్య తో నటించడం జీవిత ఆశయం కాబట్టి ఇలాంటి మామూలు పాత్రను ఎలా ఒప్పుకుంటావని ఫాన్స్ నిలదీస్తున్నారు. ఇక మహర్షి తర్వాత సూపర్ స్టార్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ లో కూడా సాయిపల్లవిని తీసుకోవాలని చూస్తే, సున్నితంగా తిరస్కరించేసింది. దీంట్లో కూడా రష్మిక మందన్న ను తీసేసుకున్నారు.
ఇలా రెండు క్రేజీ ఆఫర్స్ చేజేతులా సాయిపల్లవి పోగొట్టుకుంది. అయితే సరిలేరు నీకెవ్వరూ మూవీ వదులుకోడానికి కారణం ఏమిటనే విషయంలో ఫాన్స్ ఎవరికి వాళ్ళు ఊహాగానాలు చేసేస్తున్నారు. సౌందర్య కూడా ఇలానే ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ తన నటనతో ఆకట్టుకుంది. అయితే సౌందర్యను ఫాలో అవుతున్న సాయిపల్లవి కొన్ని విషయాలను వదిలేసిందని అంటున్నారు. సౌందర్య సినిమాలు తగ్గుతున్న సమయంలో చిరంజీవి మూవీ అన్నయ్య,రజనీకాంత్ మూవీ లలో తన గ్లామర్ పదును పెట్టిందని చెప్పాలి. పెళ్లయినప్పటికీ ఫెరఫార్మెన్స్ తో పాటు గ్లామర్ అద్దుతూ సక్సెస్ కొడ్తున్నందున సమంత ను ఆదర్శంగా తీసుకోవాలని సాయిపల్లవికి పలువురు సూచిస్తున్నారు. మరి తన రూటు మార్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.