Movies

శ్రీకాంత్ సృష్టించిన ఈ రికార్డ్ ని బద్దలు కొట్టటం ఏ స్టార్ హీరోకి సాధ్యం కాలేదు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరి రికార్డులు వారికి ఉంటాయి. ఒకరి రికార్డ్స్ ని మరొకరు అధిగమించడంలో కొన్ని సాధ్యమైనా, మరికొన్ని సాధ్యం కావు. ఆరోజుల్లో కెసెట్స్ లో ఫుల్ మూవీ పెట్టి అమ్మేవారు. వీటి ద్వారా ఆదాయం వచ్చేది. ఇలా అప్పట్లో ఉండే ప్రక్రియలు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో తగ్గుముఖం పట్టాయి. ఇక ఓ మీడియం హీరో సాధించిన రికార్డ్స్ ని అగ్రహీరోలు సాయత్రం దాటలేకపోతున్న ఘటన హీరో శ్రీకాంత్ విషయంలో మనకు కనిపిస్తుంది. విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీకాంత్ హీరో రేంజ్ కి ఎదిగి, ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించాడు. లవర్ బాయ్ గా ,పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా, సోదరునిగా అన్ని పాత్రలకు న్యాయం చేసిన శ్రీకాంత్ వందకు పైగా సినిమాలు చేసాడు. 

ఇక హీరోగా రాణిస్తున్న సమయంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన అపురూప ప్రేమకావ్యం పెళ్లి సందడి మూవీ 1996లో జనవరి 12న సంక్రాంతి కానుకగా వచ్చి అతి పెద్ద హిట్ కొట్టింది. 23ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డ్స్ ని ఇప్పటివరకూ ఏ హీరో సినిమాలు దాటలేదు. అప్పట్లో 85లక్షల రూపాయలతో అల్లు అరవింద్,సి అశ్వినీదత్ కల్సి తీశారు. అయితే ఈ మూవీ 15కోట్లు వసూలు చేసింది. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఒక కోటి 20లక్షలు వసూళ్లు రాబట్టింది. తెలుగులో అలనాటి లవకుశ తర్వాత అలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా పెళ్లిసందడిగా మూవీ అసోసియేషన్ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. నెలరోజుల్లోనే మూడు లక్షల కెసెట్స్ అమ్ముడవ్వడం ద్వారా ఆడియో అమ్మకాల్లో కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. 

సంధ్య థియేటర్ లో 270రోజులు ఆడిన పెళ్ళిసందడి విజయవాడ స్వప్నలో రోజుకి 4ఆటలు చొప్పున 301రోజులు ఆడి సంచలనం సృష్టించింది. అయితే ఆతర్వాత ఏడాదిపాటు ఆడిన సినిమాలున్నా, రోజూ నాలుగు ఆటలు ఆడిన దాఖలాలు లేవు. ఎందుకంటే రోజులో ఒకటి రెండు షోస్ వేసి,మిగిలిన షోస్ వేరే సినిమాలు వేస్తూ ఏడాది పాటు ఆడించిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ పెళ్లి సందడి ఏడాది ఆడింది. అంతేకాదు 27సెంటర్స్ లో రోజుకి నాలుగు ఆటల చొప్పున 170రోజులు ఆడింది. అప్పటికీ ఇప్పటికీ రికార్డ్ ఇదే. ఇక తొలివిడతలో 34సెంటర్స్ లో విడుదల చేయగా, అన్ని చోట్లా వందరోజులు నడిచింది. సెకండ్ రిలీజ్ లో 25సెంటర్స్ విడుదలై వందరోజులు అడగా,8సెంటర్స్ లో 224రోజులు,13కేంద్రాల్లో 200రోజులు ఆడింది.