సందీప్ కిషన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు…హీరో కాకముందు ఏమి చేసేవాడో తెలుసా?
సందీప్ కిషన్ చెన్నైకి చెందిన తెలుగు కుటుంబంలో మే 7 1987 న జన్మించారు. తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు. ఆయన చెన్నైలోని లయోలా కాలేజీ నుండి పట్టభద్రుడైనాడు. సందీప్ కిషన్ “ఛోటా కె.నాయుడు” మరియు “శ్యాం కె.నాయుడులకు మేనల్లుడు. సందీప్ కిషన్ తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో నటించాడు. సందీప్ కిషన్ దర్శకుడు గౌతమ్ మీనన్ యొక్క వారణం ఆయిరం (2008) చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఒక సంవత్సరం పాటు సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు చిత్రం ప్రస్థానం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
‘స్నేహగీతం, ప్రస్థానం’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్ బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్ 3 చిత్రాల్లో ఒకటైన ‘షోర్ ఇన్ ద సిటీ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాడు . చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటించిన హీరోగా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. యారుదా మహేష్ సినిమాతో తమిళంలోకి అడుగు పెట్టాడు. సందీప్ కిషన్ కి జగదేక విరుడు అతిలోక సుందరి సినిమా అంటే చాలా ఇష్టం. ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి హీరోగా,నిర్మాతగా కొట్టాడు.