రాఖీ పండుగ ప్రాముఖ్యతపై చారిత్రక కథనాలు
పూర్వం బలి మహారాజు భక్తికి మెచ్చి సాక్షాత్తు విష్ణు మూర్తి తన రాజ్యాన్ని కాపాడే పని మీద లక్ష్మి దేవిని వైకుంఠం లోనే వదిలి వెళ్ళాడట. అప్పుడు లక్ష్మి దేవి భర్త ఎక్కడ ఉంటే అదే వైకుంఠంగా భావించి మానవ స్త్రీ గా వెళ్ళి తన భర్త వచ్చే దాక అన్నగా కాపాడమని బలి చక్రవర్తిని కోరిందట. శ్రావణ పౌర్ణమి రోజున ఆమె ఒక పట్టు దారం బలి చక్రవర్తి కుడి చేతికి కట్టి జరిగిన విషయం చెప్పింది. అది విన్న బలి చక్రవర్తి ఆహా ఏమి నా భాగ్యం. నన్ను అనుగ్రహించడానికి మీరు ఇంత శ్రమ తీసుకున్నారు అని సకల మర్యాదలతో లాంచనాలతో తోబుట్టువును అప్పగించినట్టు విష్ణు మూర్తి కి లక్ష్మి దేవిని అప్పగించాడట బలి చక్రవర్తి. ఆ రోజు నుంచి శ్రావణ పూర్ణిమ రక్షా బంధనం గా స్థిరపడింది.
శిశుపాలుని వధించినపుడు చేతి కి గాయం అవడంతో పాండవుల పట్ట మహిషి ఐన ద్రౌపది తన చీర అంచు కొద్దిగా చింపి రక్తం పోకుండా కట్టు కట్టిందట. ఆ చిన్న సాయానికి అమితానందం పొందిన శ్రీ కృష్ణుడు ఆమె ఆనందం కోసం తరవాతి 25 యేళ్ళు పాండవుల పక్షపాతి గా నే ఉన్నాడు.
యముడి చెల్లెలు యమునా దేవి కూడా ఈరోజున రాఖీ కట్టిందట. ఫలితంగా ఆమె జీవ నది గా ఎప్పటికీ ఉండే వరాన్ని ఇచ్చాడు. రక్షాబంధనాన్ని గౌరవించండి.అది క్రీ పూ .326.నేడు డు పంజాబు రాష్ట్రం అని పిలువబడుతున్నఈ ప్రాంత రాజ్యాన్ని ఆరోజులలో ‘పురుషోత్తముడు ”అనే గొప్ప రాజు పరి పాలిస్తున్నాడు .ఇది జీలం చీనాబు నదుల మధ్య ఉంది .గ్రీకు వీరుడు అలెగ్జాండరు ప్రపంచ విజేత కావాలనే ఉద్దేశం తో గ్రీకు లోని మాసిడోనియా నుండి బయల్దేరి ,యూరపు అంతటా జయించి ఆసియా ను స్వాధీన పరచుకొని భారత దేశం వరకు వచ్చాడు .సై న్యాన్ని జీలం నది ఒడ్డున విడిది చేయించి పురుషోత్తముని తో, యు ద్దానికి సన్నద్ధు డవు తున్నాడు .అతన్ని ప్రేమించిన ”రుక్సానా ”అనే స్త్రే అలెగ్జాండర్ కు తెలీకుండా అతని ని కంటే ముందు వచ్చి చేరింది .
మారు వేషం లో ఉందామె .ఆ రోజు రాఖీ పండుగ .ప్రజలందరూ రాజైన పురుషోత్తముడికి రక్షా కడుతున్నారు .ఆయన వారికి కానుక లిచ్చి పంపిస్తున్నాడు రుక్సానా కూడా వచ్చి రక్ష కట్టింది .ఆయనకు ఆమె కొత్త స్త్రీ అని పించింది .రక్షా కట్ట్టిన తర్వాత”అమ్మా ! నువ్వెవరివి గ్రీకు స్త్రీ లా ఉన్నావు .నీఎకు వచ్చిన ఇబ్బంది ఏమిటి .రక్ష కట్టిన స్త్రీ నాకు సోదరి తో సమానం .ఈ అన్న దగ్గర దాయకుండా మనసు లోని కోరిక తెలియ జేయి .తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాను ”అన్నాడు .దానికి ఆమె సంకోచపడ కుండా ”అన్నా !నేను ప్రపంచ విజేత అలెగ్జాండర్ ను ప్రేమించి వచ్చిన స్త్రీని .నా ప్రియుని ప్రాణ భిక్ష నాకు కావాలి .అదే ఈ చెల్లెలి కోరిక ”అన్నది .”నీ కోరిక తప్పక తీరుస్తానమ్మా !”అని వాగ్దానం చేశాడు .సంతోషం తో నిండిన కృతజ్ఞత తో సంతృప్తి తో నమస్కారం చేసి అలెగ్జాండర్ ప్రియురాలు రుక్సానా వెళ్లి పోయింది.