భారత ‘స్వాతంత్య్రం’ గురించి ఈ 10 నిజాలు మీకు తెలుసా?
1. ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి నుంచే మనం 71వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇదే రోజు భారత్ తో పాటు కొరియా, కాంగో, బెహ్రయిన్, లీచెన్ స్టీన్ దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి.
2. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని ఆఖరి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్&బాటెన్ మన పెద్దలకు సూచించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ తేదీనీ ఆయన సూచించారు. సింగపూర్లో జపాన్ లొంగుబాటును అంగీకరించిన సౌత్-ఈస్ట్ ఆసియా కమాండ్ కు మౌంట్ బాటెన్ సుప్రీం అలైడ్ కమాండర్ గా వ్యవహరించారు.
3. జాతీయ గీతం జన గణ మణ’ను రబీంద్రనాథ్ ఠాగూర్ రచించారని అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ గీతాన్ని బ్రిటిష్ కింగ్ జార్జ్ వి గౌరవార్థం ఠాగూర్ రంచించారు. 1911లో కింగ్ జార్జ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఈ గీతాన్ని ఠాగూర్ సిద్ధం చేశారు.
4. జాతీయ గేయం వందేమాతరంను బంకించంద్ర ఛటర్జీ రచించారు. వాస్తవానికి ఇదొక పద్య భాగం. ఛటర్జీ రచించిన ఆనంద్ అమర్ నవలలో మొదటి రెండు చరణాలను తీసుకుని జాతీయ గేయంగా ప్రకటించారు.
5. భారత స్వాతంత్య్రోద్యమం 1857లోనే ప్రారంభమైంది. మంగల్ పాండే నాయకత్వంలో తొలి సిపాయి తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు తరవాత బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్య తోపె, బహదూర్ షా జఫర్, నానా సాహెబ్ పోరాటాలు చేశారు.
6. భారత్, పాకిస్థాన్ విడిపోయినప్పుడు రాచరిక పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ రాష్ట్రం తటస్థంగా ఉండిపోయింది. రాష్ట్రంలో ముస్లింలే అత్యధికంగా ఉన్నారు కాబట్టి పాకిస్థాన్ లోనే కలుస్తుందని ఆ దేశం నమ్మింది. కానీ అప్పటి హిందూ రాజు జమ్మూ కశ్మీర్ ను భారత్ లో విలీనం చేశారు. 1947 అక్టోబర్ లో జమ్మూ కశ్మీర్ భారత్ లో విలీనం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై భారత్, పాక్ మధ్య వివాదం రగులుతూనే ఉంది.
7. విదేశీ ఉత్పత్తులను బహిష్కరిస్తూ దేశీ ఉత్పత్తులకు మద్దతుగా 1900 ప్రారంభంలో బాల్ గంగాధర్ తిలక్ తో కలసి సర్ రతన్ జంషెడ్ టాటా.. బొంబే స్వదేశీ కోఆపరేటివ్ స్టోర్స్ కో లిమిటెడ్ ను స్థాపించారు. ప్రస్తుతం అది బోంబే స్టోర్ గా సుప్రసిద్ధం.
8. జాతీయ గీతంగా వందేమాతరానికి బదులు జన గణ మణను తీసుకున్నారు. ఆర్మీ బ్యాండ్ లో వాయించడానికి వందేమాతరం కన్నా జన గణ మణ అయితే సులభంగా ఉంటుందని జవహర్ లాల్ నెహ్రూ భావించారట.
9. భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దును సిరిల్ జాన్ ర్యాడ్ క్లిఫ్ నిర్ణయించారు. ఈయన బ్రిటిష్ న్యాయ కోవిదుడు. భారత భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహనలేకుండానే ర్యాడ్ క్లిఫ్ సరిహద్దును నిర్ణయించారు. తన నిర్ణయంపై చనిపోయేంత వరకు ర్యాడ్ క్లిఫ్ బాధపడుతుండేవారని చెబుతుంటారు.
10. ఇండియా అనే పేరును ఇండస్ (సింధూ) నది నుంచి తీసుకున్నారు. అత్యంత ప్రాచీనమైన సింధూ నాగకరితకు నిదర్శనంగా ఈ పేరును పెట్టారు.