Movies

సుధీర్ బాబు ఎవరి కొడుకో తెలుసా….బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న యువ హీరోల్లో ఎవరి ప్రత్యేకత వారిదే. మారిన ట్రెండ్ కి అనుగుణంగా తమని తాము మార్చుకొని సక్సెస్ గా ముందుకు దూసుకు వెళ్ళుతున్నారు ఈ తరం కథానాయకులు. అలాంటి వారిలో సుధీర్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు అయినా సుధీర్ ఆ తర్వాత ఎంతో శ్రమించి తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని సంపాదించాడు.

కృష్ణ,మహేష్ బాబు వంటి సెలబ్రెటీలు తన వెనక ఉన్న, వారి నుంచి ఏమి ఆశించకుండా స్వశక్తితో ఎదిగాడు సుధీర్ బాబు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి SMS తో హీరోగా మారాడు సుధీర్ బాబు. SMS తో హీరోగా మారిన సుధీర్ బాబు ప్రస్థానం ఎంతో ఆసక్తికరం అని చెప్పాలి.

సుధీర్ బాబు 1979 లో విజయవాడలో జన్మించాడు. తండ్రి పోసాని నాగేశ్వరరావు పురుగు మందుల ఫ్యాక్టీరీకి అధినేత. తల్లి రజని గృహిణి. ఈ ఫ్యాక్టీరీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉండగా, దానికి సంబందించిన కార్పొరేట్ ఆఫీస్ విజయవాడలో ఉండేది. అప్పట్లోనే కోట్లలో లాభాలు గడించిన సంస్థగా పేరు పొందింది.

కుబేరుల కుటుంబంలో పుట్టిన సుధీర్ బాబు చిన్నతనం నుండి చాలా గారాబంగా పెరిగాడు. చిన్నతనంలో సుధీర్ బాబు విపరీతంగా అల్లరి చేసేవాడట. ఎవరైనా ఇంటికి రావాలంటే ఇంటిలో సుధీర్ ఉన్నాడో లేదో కనుక్కొని మరీ వచ్చేవారట.

సుధీర్ బాబును చిన్నతనములోనే ఊటీలో ఫెమస్ స్కూల్ లో జాయిన్ చేసారు. అక్కడ LKG,UKG చదివాడు. ఆ తరవాత గుంటూరులో ఉన్న నల్లపాడు లయోలా స్కూల్ లో చదివాడు. అక్కడ ఉన్నప్పుడే నాల్గొవ తరగతిలో బ్యాట్మెంటన్ అంటే ఆసక్తి కలిగింది.

ఆ ఆసక్తి సుధీర్ ని నేషనల్ లెవల్ కి తీసుకువెళ్ళింది. ఇప్పుడు జాతీయ కోచ్ గా ఉన్న పుల్లెల గోపీచంద్ సుధీర్ కి డబుల్స్ పార్ట్ నర్ గా ఉండేవాడు. ఇంజనీరింగ్ చదువు పూర్తి అయ్యాక సినిమాల మీద ఆసక్తితో ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

మొదటి శ్రీను వైట్ల ఆనందం సినిమా ఛాన్స్ ఇస్తే వద్దని అన్న సుధీర్ బాబు, ఆ సినిమా హిట్ కావటంతో ఆ సినిమా కాదని అనుకునందుకు చాలా బాధ పడ్డాడట. కృష్ణవంశీ అడిషన్స్ నిర్వహిస్తూ ఉంటే అక్కడకు వెళ్లిన సుధీర్ బాబుకు ఘోర అవమానం ఎదురు అయింది. నీవు సినిమాలకు పనికిరావని చెప్పి వెనక్కి పంపేసారట.

ఆ తర్వాత సుధీర్ గార్మెంట్ బిజినెస్ చేసి చేతులు కాల్చుకున్నాడు. అప్పుడు సుధీర్ తల్లితండ్రులు పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడని భావించి పెళ్లి ప్రయత్నాలను మొదలు పెట్టారు. సుధీర్ తల్లి రజనికి మహేష్ బాబు అముమ్మ చాలా క్లోజ్. ఇద్దరు కలిసి తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళుతూ ఉండేవారు.
ఆ విధంగా తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని మహేష్ అముమ్మకు చెప్పటం ఆమె కృష్ణ కూతురు ప్రియదర్శిని గురించి చెప్పటం సుధీర్ ఘట్టమనేని అల్లుడు కావటం చకచకా జరిగిపోయాయి. ఇక సుధీర్ బాబు సినిమా ప్రస్థానం చాలా ఆసక్తికరమనే చెప్పాలి.

పద్మాలయ స్టూడియోలో మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్ నిర్మిచారట. ఆ బ్లాక్ లో సుధీర్ బాబు ఆరు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడ తాను తీసుకున్న శిక్షణ,ఆ తర్వాత తాను ఇంప్రూవ్ అయిన విధానాన్ని వీడియోగా తీసి నమ్రతకు ఇచ్చాడట.

నమ్రత ఆ వీడియోని మహేష్ బాబుకి చూపితే చాలా ఇంప్రెస్ అయ్యాడట. ఆ తర్వాత మంజుల నిర్మాణంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత SMS సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా హిట్ కావటంతో ప్రేమకథా చిత్రం వెతుక్కుంటూ వచ్చింది.