సంఘవి, శ్రీకాంత్ మధ్య అంత జరిగిందా…? అలీ తమ్ముడు ప్రపోజ్ కి ఏం చేసిందో చూడండి
ఇండస్ట్రీలో తనకు మీనా బెస్ట్ ఫ్రెండ్ అని, రంభ,మహేశ్వరిలను కూడా అప్పుడప్పుడు కలుస్తుంటానని చెప్పారు. ఒకవేళ తాను అబ్బాయిగా పుట్టి ఉంటే మీనాకు ప్రపోజ్ చేసేదాన్ని అన్నారు. సింధూరం సినిమాలో ‘హాయ్ రే హాయ్.. జాంపండురోయ్..’ పాట ఇప్పటికీ ఎవర్గ్రీన్. సంఘవి అందచందాలను వర్ణిస్తూ రవితేజ అల్లరి చేసే ఆ పాటలో.. నిజంగానే ఆమె అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సంఘవి.. ఆ తర్వాతి కాలంలో సినిమాలకు దూరమైంది. చాలా రోజుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు మంచి పాత్రల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈటీవిలో ప్రసారమయ్యే అలీ షోలో పాల్గొన్న సంఘవి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఎవరైనా లవ్ లెటర్స్ రాశారా…? అని అలీ సంఘవిని ప్రశ్నించగా.. ఎవరో ఎందుకు.. మీ తమ్ముడే రాశాడని చెప్పారు.’ఉరికి మొనగాడు’ సినిమా షూటింగ్ సమయంలో ప్రతీరోజూ ఓ గులాబీ పువ్వు,గ్రీటింగ్ కార్డు ఇచ్చేవాడని అన్నారు. అప్పుడు ఖయ్యూంను చూస్తే జాలీగా అనిపించేదన్నారు. ఖయ్యూం అలా లవ్ లెటర్ ఇవ్వగానే తాను శ్రీకాంత్ టాపిక్ తీసుకొచ్చేదాన్ని అని చెప్పారు.’శ్రీకాంత్ కూడా నన్ను ప్రేమిస్తున్నారు. నేను ఆయన్ను కాదంటే.. ఈ సినిమా ఆగిపోతుంది.ఏం చేయమంటావ్’ అని ఖయ్యూంను అడిగేదాన్నని చెప్పారు. దానికి ఖయ్యూం ‘సినిమా ఆగిపోతే మళ్లీ మీరు కనిపించరు.. మిమ్మల్ని చూడకుండా ఉండలేను. కాబట్టి ఆయనకు నో చెప్పవద్దు. కానీ నన్నే ప్రేమించాలి.’ అనేవాడని పేర్కొంది. శ్రీకాంత్‌కు ఊహతో పెళ్లయిపోయాక తనకు లైన్ క్లియర్ అయిపోయిందని ఖయ్యూం తెగ సంబరపడిపోయాడని చెప్పుకొచ్చింది.