Movies

చిరు నటించిన 151 చిత్రాలలో టాప్ మూవీ ఏదంటే…!

మెగాస్టార్ చిరంజీవి 151చిత్రంగా వచ్చిన ప్రతిష్టాత్మక సైరా చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికే సైరా వసూళ్లు తెలుగు రాష్ట్రాలలో నాన్ బాహుబలి రికార్డ్ ని సాధించాయి. మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సైరా నిలకడగా వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో సైరా 90కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం గమనార్హం.

ఎంతో ఇష్టపడి చేసిన ఈ మూవీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చిరు విరివిగా ప్రొమోషన్స్ లో పాల్గొనడం జరిగింది. కాగా ఇటీవల పాత్రికేయుల ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న చిరుని ఓ విలేఖరి మీ నలభైఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో, నటించిన 151 చిత్రాలలో మొదటి స్థానం ఏ చిత్రానికి ఇస్తారు?, అని అడుగగా, చిరంజీవి…,సైరా నరసింహారెడ్డి మోవీనే, అందులో ఎటువంటి సందేహం లేదని కుండబద్దలు కొట్టారు.