Politics

రోజాకు మరో కీలక బాధ్యతలు అప్పచెప్పిన జగన్..! మరి జబర్దస్త్ సంగతి…???

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు మరో బంఫర్ ఆఫర్ వచ్చింది. నగరి ఎమ్మెల్యేగా వరుసగా రెండో సారి గెలిచిన రోజాకు జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఖచ్చితంగా లభిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే కొన్ని సమీకరణాల నేపధ్యంలో రోజాకు కేబినెట్‌లో అవకాశం లభించలేదు. అయితే రోజాకు కేబినెట్ హోదా కలిగిన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని అప్పచెప్పారు జగన్.

అయితే రోజాకు తాజాగా సీం జగన్ మరో కీలక బాధ్యతలు అప్పచెప్పారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఎలా భారీ మెజారిటీనీ గెలుచుకుందో, త్వరలో రానున్న పంచాయితీ ఎన్నికలలో కూడా వైసీపీ ప్రభంజనం సృష్టించాలని జగన్ ఆలోచిస్తున్నారట. అయితే మొన్న ఎన్నికలలో ఎవరైతే తక్కువ మెజారిటీతో విజయం సాధించారో వారు ఇక నుంచి తమ తమ నియోజకవర్గాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీనీ గెలిపించుకోవాలని ఆదేశించారట. అయితే మొన్న ఎన్నికలలో రోజా కేవలం 2 వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే విజయం సాధించడంతో ఈ మేరకు జగన్ రోజాకు కూడా ఇదే బాధ్యత అప్పచెప్పారట. అయితే అప్పటి నుంచి రోజా ఈ మధ్యన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వార్డ్ వాక్ పేరుతో ప్రజలలో తిరుగుతున్నారు. అంతేకాదు పార్టీ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లు, సభలలో పాల్గొంటూ పార్టీ గెలుపు కోసం, తనకు జగన్ ఇచ్చిన బాధ్యతలను రీచ్ కావాలని తెగ ప్రయత్నిస్తున్నారట.