టీవీ నటి సమీరాతో నటి సన కొడుకు వివాహం… నాలుగున్నర ఏళ్ల ప్రేమకు బ్రేక్
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు, తమిళంలో కలిపి దాదాపు 600 సినిమాల్లో నటించారామె. సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. మరోవైపు టీవీ నటి సమీరా కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మొహమే. సీరియల్స్, డ్యాన్స్ షోల ద్వారా తెలుగు ఆడియన్స్‌కు ఆమె దగ్గరయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ అత్తాకోడళ్లు అయ్యారు.
సన కుమారుడు అన్వర్.. సమీరాను వివాహమాడారు. గత నాలుగున్నరేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం పెద్దగా హడావుడి లేకుండా కుటుంబ, మత పెద్దల మధ్య సోమవారం రాత్రి జరిగింది. ఈ మేరకు సన, ఆమె భర్త సయ్యద్ సదుద్దీన్ మంగళవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.