ఎమ్మెల్యే రోజా లవ్ స్టోరీ చూస్తే షాకవ్వాల్సిందే..? సినిమా స్టోరీ మించి…
ఎమ్మెల్యే రోజా తన లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. నా భర్త సెల్వమణి, నేను 12 ఏళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామన్నారు. తమకు ఇద్దరు పిల్లలని… సంతోషంగా జీవిస్తున్నామని తెలిపారు.
విశాఖ భీమిలి ఉత్సవ్ వేడుకల్లో పాల్గొన్న రోజా… తనకు భీమిలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన భర్త ఇక్కడి వ్యక్తేనని, తనకు మొదటి సారి ఇక్కడే ఐ లవ్ యూ చెప్పాడని తెలిపింది. అంతేకాదు రోజా సినీ కెరీర్‌కు కూడా భీమిలితోనే మొదలైందని… చామంతి సినిమా ఇదే భీమిలి బీచ్‌లో జరిగిందన్నారు. ఏడాది పాటు ఇక్కడే ఉన్నామని ఆనందంగా ప్రకటించింది రోజా. ఆలా రోజా బీమిలితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.