Movies

శ్రీహరి ”తమ్ముడు’ కూడా మనందరికీ బాగా తెలిసిన టాలీవుడ్ స్టార్ నటుడు

బాడీబిల్డింగ్ లో స్టేట్ వైడ్ విన్నర్ గా నిల్చి,సబ్ ఇనస్పెక్టర్ గా రైల్వే లో ఉద్యోగం సంపాదించి కూడా సినీ రంగం మీద మోజుతో ఉద్యోగాన్ని సైతం కాదనుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. అతడే రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి. మొదట ఫైట్ మాస్టర్ గా స్టెంట్స్ కంపోజ్ చేసిన శ్రీహరి ఆతరవాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయ్యాడు. ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొంటూ మొత్తానికి హీరో కూడా అయ్యాడు. దాదాపు 120సినిమాల్లో నటించి అందరిచేతా ప్రశంసలు పొందాడు.

ఎందరో హీరోల పక్కన నటించి మంచి టాలెంట్ గల నటుడుగా నిరూపించుకున్న శ్రీహరి అప్పట్లో డిస్కో డాన్సర్ గా నటిస్తూ పేరుతెచ్చుకున్న డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె పుట్టారు. అయితే కూతురు మూడు మాసాల వయసులోనే హఠాత్తుగా చనిపోవడంతో కూతురి పేరిట సేవా కార్యక్రమాలు ప్రారంభించడమే కాదు,రెండు ఊళ్లను దత్తత తీసుకుని వాటి అభివృద్ధిలో భాగం పంచుకున్నాడు.

ఇంతటి పేరు తెచ్చుకున్న శ్రీహరి సినీ కెరీర్ టాప్ లో ఉండగానే కేన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే శ్రీహరి తమ్ముడు కూడా అన్నలా కాకపోయినా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుని సినిమా లలో సత్తా చాటాడు. సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన అతడి పేరు శ్రీధర్. పోలీస్ సిస్టర్స్ సినిమాలో కీలక పాత్ర కూడా పోషించాడు.