ఆ కారణంగానే నాగార్జునతో ఇక సినిమాలు చేయలేమని చేతులెత్తిసిన డైరెక్టర్స్…. ఏమి జరిగిందో తెలుసా?
టాలీవుడ్ మన్మథుడిగా పేరొందిన నాగార్జున సినీ ఇండస్ట్రీలో టాలెంట్ గల డైరెక్టర్స్ ని పరిచయం చేసాడు. వాళ్ళు చిన్నవాళ్ళని కూడా చూడకుండా టాలెంట్ ని ఎంకరేజ్ చేసాడు. ఇప్పటికీ ఎందరికో ఇలా ఛాన్స్ లు ఇస్తూ మంచి గుర్తింపు పొందాడు. అయితే తను అనుకున్న రిజల్ట్స్ రాకపోతే నేరుగా డైరెక్టర్స్ పై కామెంట్స్ చేయడంలో కూడా నాగ్ ముందుంటాడు.
తానే డిజైన్ చేసిన దర్శకుడు వీరభద్ర చౌదరి భాయ్ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయింది. దీంతో డైరెక్టర్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేయడంతో డైరెక్టర్ కెరీర్ పై పెద్ద ప్రభావమే చూపింది. ఇక మన్మధుడు 2విషయంలో స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ని కూడా ఇబ్బంది పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ లో మార్పులు చేయించి తనకు తగ్గట్టు తీయించాడు. ఇక సోగ్గాడే చిన్ని నాయనే డైరెక్టర్ విషయం కూడా అలానే ఉందంటున్నారు. ఎందుకంటే బంగార్రాజు అతడి డైరెక్షన్ లో తీస్తానని నాగ్ చెప్పి ఇప్పుడు స్క్రిప్ట్ బాగోలేదని మీడియా ముందు చెప్పేసాడు.
ఇక అప్పటి వరకూ ఏవో చిన్న సినిమాలు చేసుకుంటూ పోతున్న శ్రీనివాస రెడ్డి ని పిలిచి ఢమరుకం ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ఊహించిన విధంగా లేకపోవడంతో డైరెక్టర్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే, హలో బ్రదర్ సినిమా సీక్వెల్ చేద్దామని చెప్పి,పదినెలలు స్క్రిప్ట్ వర్క్ అయ్యాక సడన్ గా ఆపించేసారు. అయితే నాగ చైతన్యతో దుర్గ సినిమా ఇచ్చినట్టే ఇచ్చి రద్దుచేశారు. రద్దయిన సినిమాల వల్లనే తన కెరీర్ ఇలా అయిందని పరోక్షంగా నాగ్ మీద శ్రీనివాస రెడ్డి ఓ ఇంటర్యూలో వ్యాఖ్యలు చేసాడు. ఇతడి డైరెక్షన్ లో రాగల24గంటల్లో మూవీ విడుదల కాబోతోంది. మరి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యలపై నాగ్ ఎలా రియాక్ట్ అవుతాడోనని అందరూ ఎదురుచూస్తున్నారు.