కోహ్లీ తాగే నీరు మంచి నీళ్ళే కాదట… మరి ఏమిటో తెలుసా?
పల్లెటూర్లలో మంచి నీటి కోసం రోజుకు అయిదు పది కిలోమీటర్ల మేరకు వెళ్లే పరిస్థితి ఇండియాలో ఇప్పటికి అక్కడక్కడ ఉందంటే అతిశయోక్తి కాదు.మంచి నీటి కోసం ఇంకా ఎంతో మంది ఇండియన్స్ పోరాటాలు చేస్తూనే ఉన్నారు.తాగడానికి శుద్దమైన మంచి నీళ్లు లేక పోవడంతో ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్న విషయం తెల్సిందే.దేశంలో ఇలాంటి పరిస్థితి ఒక వైపు ఉంటే మరో వైపు అత్యంత ఖరీదైన వాటరు తాగే వ్యక్తి కూడా ఇండియాలో ఉన్నాడు.
ఆయన మరెవ్వరో కాదు విరాట్ కోహ్లీ.అవును విరాట్ కోహ్లీ తాగే ఇవియన్ బ్రాండ్ వాటర్ బాటిల్ ఒక లీటరు ఖరీదు దాదాపుగా 1500 రూపాయలు.ఇవియన్ ఏంటీపశ్చిమ యూరప్‌లో ఇవియన్ అనే ఒక ప్రాంతంలో మంచి నీటి సరసు ఉంది.ఆ సరస్సులో ఉన్న నీళ్లు సహజసిద్దమైన మినరల్స్‌ను కలిగి ఉన్నాయి.మనం తాగే నీళ్లను శుద్ది చేసి, మినరల్స్‌ను కలిపి తయారు చేస్తారు.కాని ఇవియన్ ప్రాంతంలో ఉన్న ఆ నీరు సహజంగానే శుద్దంగా ఉండటంతో పాటు మంచి ఆరోగ్యంను అందించే మినరల్స్ చాలా ఉంటాయి.ఆ సరస్సు యొక్క గొప్పదనం చిత్రమైన పద్దతిలో తెలిసింది.
1789లో మార్కిన్ అనే వ్యక్తి ప్రతి రోజు వృతిరీత్యా ఆ సరసు దాటి అవతల ఒడ్డున ఉన్న చోటుకు వెళ్లాల్సి వచ్చేది.అలా కొన్నాళ్లు అతడి ప్రయాణం సాగింది.ఆ ప్రయాణంకు ముందు కిడ్నీ సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఆయనకు ఉండేవి.
ప్రతి రోజు సరస్సులో ప్రయాణించే సమయంలో కాస్త మంచి నీరు ఆ సరస్సు నుండి తాగేవాడు.అలా కొన్నిరోజుల తర్వాత తన ఆరోగ్య సమస్యలు అన్ని కూడా దూరం అయ్యాయట.ఈ విషయాన్ని స్థానిక ప్రభుత్వంకు తెలియజేయగా వెంటనే సరస్సును ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని టెస్టులు చేయించింది.అతడు చెప్పినట్లుగానే అద్బుతమైన ఔషద గుణాలు ఆ నీటిలో ఉన్నాయని వెళ్లడయ్యింది.దాంతో అప్పటి నుండి కూడా ఇవియన్ నీరు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన నీరుగా పేరు పెందాయి.
మొదట ఇవియన్ నీరు కేవలం ఔషదాల తయారికి మాత్రమే వాడాలని ప్రభుత్వం భావించింది.అయితే నీరు చాలా అధికంగా ఉంటున్న కారణంగా కొంత మొత్తంలో తాగు నీరుగా కూడా వాడాలని, అందుకోసం కొన్ని సంస్థలకు ఒప్పందాలు ఇవ్వడం జరిగింది.అలా ఇవియన్ నీళ్లు ప్రపంచంలో ఉన్న ప్రముఖుల గొంతు తడుపుతోంది.ప్రతి రోజు కోహ్లీ మంచి నీళ్ల కోసం అయిదు వేల నుండి ఆరు వేల రూపాయలు ఖర్చు చేస్తాడని తెలుస్తోంది.
ఆయన ఆరోగ్య సమస్యలు లేకుండా హెల్తీగా ఉండటానికి కారణం ఇవియన్ వాటర్ చెప్పుకోవచ్చు.అలాంటి వాటర్ ఒక్కసారైనా తాగాలని మీకు ఉంది కదా.కాని అది ఛాన్స్ లేదు.పోతే పోనివ్వు 15 వందలు ఖర్చు పెట్టి తాగేద్దాం అనుకున్నా అవి మన వరకు వచ్చే అవకాశమే లేదు.అందుకే దేనికైనా పెట్టి పుట్టాలి అంటారు.మనకు ఇవియన్ వాటర్ అదృష్టం లేదని వదిలేయడమే.