Movies

నవాబ్ ప్యాలెస్ ని మరిపించేలా మెగా హోమ్… మెగా ప్యాలెస్ విశేషాలు

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలనుంచి సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి , రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ చేసి,ఫాన్స్ కి మంచి కిక్కు ఇచ్చాడు. ఇక చిరంజీవి కట్టుకున్న ఇల్లు చూస్తే,చర్చించుకోక మానరు. అందుకే అన్నిచోట్లా ఈ మెగా ప్యాలస్ గురించి చర్చ నడుస్తోంది. మద్రాసు నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ కి వచ్చినపుడు ఎన్టీఆర్ ,అక్కినేని లతో పాటు చిరంజీవి కూడా వచ్చేసి,జూబ్లీ హిల్స్ లో ఓ భవనం కట్టుకున్నాడు.

రెండు సినిమాలు హిట్ నేపథ్యంలో మెగా హౌస్ కి సమీపంలోని కొణిదల ప్రొడక్షన్స్ ఆఫీస్ లో మీడియా సమావేశాలు పెట్టారు. రామ్ చరణ్ వివాహానంతరం చిరంజీవి ఉంటున్న ఇల్లు వాస్తు రీత్యా సరిపోవడం లేదన్న వాదన బలంగా నాటుకుందని అంటున్నారు. ఎందుకంటే, ఈ ఇంట్లో ఉండగానే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఫెయిలవ్వడం జరిగింది. 9ఏళ్ళవరకూ కోలుకోలేదు. అందుకే మెగా ఫ్యామిలీకి సరిపడా జూబ్లీ హిల్స్ లో నిర్మించిన అంత్యంత విలాసవంతమైన భవంతి చూస్తే,నైజం నవాబ్ ప్యాలెస్ ని తలపిస్తుందని టాక్.

25వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవంతిని ఇంటర్ నేషనల్ ఆర్కిటెక్ట్ తైలని హోమ్స్ సంస్థ డిజైన్ చేసింది. కేవలం డిజైన్ కోసమే కోటి రూపాయలు ఈ సంస్థ తీసుకుందంటే,ఇక ఇల్లు ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తుంది. అడుగడుగునా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దారట. నైజాం కాలం నాటి డిజైన్ లుక్ తెచ్చారట. ఒక రూమ్ చదరంగంగా తీర్చిదిద్దితే,ఒక్కో రూమ్ అంత్యంత ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ తో తీర్చిదిద్దారట. 2వ శతాబ్ద కాలం నాటి నమూనాలతో పూజ గది డైజిన్ చేసారు. పలాటియాల్ రెసిడెన్సీ పేరుతొ నిర్మించిన ఈ భవంతిలోకి గృహ ప్రవేశం అయ్యాక ఈ ఇంట్లోకి షిఫ్ట్ అవుతారట.