Movies

RRR లో ఎన్టీఆర్ ఒక్కడికే ఎంత ఖర్చు పెడుతూన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తెలుగు ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ “RRR” యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్ర దారులుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆ మధ్య ఈ భారీ ప్రాజెక్టును వదులుకుంటే ఆయనకు ఎవరో 100 కోట్లు ఆఫర్ కూడా ఇచ్చారని అయినా సరే తాను తప్పుకోలేదని తెలిపారు.అంటే ఈ చిత్రంపై ఆయన ఎంత నమ్మకంగా ఉన్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.

అలాగే ఎన్టీఆర్,చరణ్ మరియు రాజమౌళి అందులోనూ పీరియాడిక్ సినిమా అంటే ఇక ఖర్చు కూడా భారీగా ఉంటుంది.అయితే వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ చిత్రంలో ఒక్క తారక్ కోసమే మొత్తం 60 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది.అతనికి సంబంధించిన ఇంట్రో షాట్లు ఎలివేషన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా కీలకమైన సన్నివేశాలు అన్నిటికి కలిపి 60 కోట్లకు పైగా చిత్ర యూనిట్ ఖర్చు పెట్టనున్నట్టు సమాచారం.ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది.