Movies

“అలా వైకుంఠపురంలో” చిత్ర కథ విషయం లో కొత్తగా వినిపిస్తున్న పుకారు ఇదే!

హిట్ కోసం పరితపిస్తున్న అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం అలా వైకుంఠపురంలో. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి పండుగకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబందించిన ఒక ఆసక్తికర విషయం సినీ వర్గాల్లో చక్కెర్లు కొడుతుంది. ఈ చిత్రం యొక్క కథ అప్పటి ఎన్టీఆర్ నటించిన “ఇంటిగుట్టు” చిత్ర కథని పోలి ఉంటుందని సమాచారం.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ ని మిస్ చేయలేదు. ఈ చిత్రంలో కూడా అవన్నీ వుంటాయని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ చిత్రాన్ని ఇప్పటితరం ప్రేక్షకులకి అర్థమయ్యేలా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందనేది చిత్రం విడుదల అయ్యేవరకు తెలీదు. ఇప్పటికే అల్లు అర్జున్ తో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి తీసిన త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు, ప్రోమోలు, టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.