Movies

వదినమ్మ సీరియల్ సిరి గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు

ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ టాప్ టు గా రాణిస్తోంది. ఇందులో తెలంగాణా యాసతో నటిస్తున్న సిరి అసలు పేరు ప్రియాంక నాయుడు. తన నటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈమె తెలుగు అమ్మాయి కాదు. అయినా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వంట చక్కగా చేస్తుందట. కర్ణాటకలోని బెంగళూరులో ఫిబ్రవరి 26న జన్మించింది.

ప్రియాంకను ఇంట్లోవాళ్లంతా పింకీ అని పిలుస్తారు. ఇక ఈమెకు చిన్ననాటి నుంచి బేబీ షామిలి అంటే చాలా ఇష్టమట. ఈమె ఫేవరేట్ హీరో మెగాస్టార్ చిరంజీవి. చిరుతో కల్సి ఒక్క సినిమా అయినా చేయాలనీ ఈమె కోరికట. షామిలి సినిమాలో ఏ డ్రెస్ వేసుకుంటే అదే కావాలని ప్రియాంక చిన్నపుడు గొడవ పడేదట. షామిలి నటన చూసి ఈమె నటనపై ఆసక్తి పెంచుకుంది. వాళ్ళ బంధువులకు మోడల్ ఏజన్సీ ఉండడంతో వాళ్ళ ప్రోత్సాహంతో డిగ్రీ అయ్యాక 2016లో ఫ్యాషన్ షో లో పాల్గొంది.

ఆవిధంగా మిస్ బెంగళూరుగా ఎంపికైన ప్రియాంక కు కన్నడ డైరెక్టర్ కబడ్డీ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇదే సినిమా తెలుగులో భీమిలి కబడ్డీ జట్టు పేరుతో వచ్చింది. ఆతర్వాత ఆస్కార్ అనే కన్నడ మూవీలో చేసింది. తెలుగులో కేరింత మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అనగనగా ఓ దుర్గ ,లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి మెప్పించింది. స్వాతి చినుకులు సీరియల్ లో కూడా చేసి,మంచి గుర్తింపు తెచ్చుకుంది.