S/o సత్యమూర్తి మూవీలోని ఈపాప ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే అసలు నమ్మలేరు
సన్నాఫ్ సత్యమూర్తి మూవీలో నటించిన పాప చిన్నారిగా నటన అదరగొట్టేసింది. ఈమె పేరు వర్ణిక. సినిమాలో స్వీటీ. ఆపాపతో చేసిన సాంగ్ కి బన్నీ ఫాన్స్ ఇప్పటికీ ఫిదా అయిపోతారు. ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చింది. ఆమెను పేరెంట్స్ అందంగా తయారుచేసి సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు.
అలా సోషల్ మీడియాలో చూసిన ఫోటోలు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరకు వెళ్లాయి. అప్పుడే సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కోసం చిన్నారి పాపను వెతుకుతున్న త్రివిక్రమ్ కి వర్ణిక కంటపడడంతో ఆమె బాగా నచ్చింది. ఎలాంటి ఆడిషన్స్ లేకుండా ఒకే చేసేసారు.
ఇక ఆ మూవీ తర్వాత నాన్నకు ప్రేమతో,బాబు బంగారం మూవీస్ లో చేసింది. అయితే సినిమాలు వరుసగా చేయడం వలన స్టడీ పాడవుతుందని సినిమాలకు పేరెంట్స్ బ్రేక్ ఇప్పించారు. ఇప్పుడు చదువుపై ఫోకస్ పెట్టి బాగా రాణిస్తోందట.