జూనియర్ ఎన్టీఆర్ కార్ డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
నందమూరి నట వారసతంతో ముందుకొచ్చి, తెలుగు ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. అంచెలంచెలుగా ఎదిగాడు. మొదట్లో హిట్స్ వచ్చినా మధ్యలో కొన్ని ప్లాప్స్ మూటగట్టుకున్నాడు. అయితే మళ్ళీ మంచి స్టోరీస్ వైపు మొగ్గుచూపడంతో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. సినిమాల పరంగా స్టార్ హీరో రేంజ్ ని అందుకున్న తారక్ , వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తాడు.
ముఖ్యంగా మంచి యాక్టివ్ గా ఉన్నప్పుడే తారక్ అప్పుడప్పుడు డ్రైవింగ్ చేస్తాడు. ప్రత్యేకంగా డ్రైవింగ్ చేయడు. అందుకే ఓ మంచి డ్రైవర్ ని పెట్టేసుకున్నాడు. డ్రైవర్ ని పెట్టుకున్నప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ సక్రమంగా ఉందా లేదా, అనుభవం ఉందా లేదా, తాగుడు అలవాటు ఉందా, ఇంతకుముందు ఎక్కడ పనిచేశాడు ఇవన్నీ అలోచించి మంచి డ్రైవర్ ని ఏర్పాటుచేసుకున్నాడు.
తండ్రి, సోదరుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో డ్రైవర్ విషయంలో తారక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ఉండాలని కోరుకుంటాడు. మరి ఇన్ని రకాలుగా టెస్ట్ చేసి పెట్టుకునే డ్రైవర్ కి తారక్ ఇచ్చే, జీతం ఎంతో తెలిస్తే, అందరూ షాకవ్వాల్సిందే. దాదాపు నెలకు 80వేల రూపాయల జీతం అందిస్తున్నాడట. డ్రైవర్ ప్రవర్తన వంటివన్నీ పరిశీలించి ఈవిధంగా జీతం ఇస్తున్నాడట.